హైదరాబాద్ మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో ఇద్దరు పాత నేరస్థుల మధ్య ఘర్షణ జరిగింది. నిన్న రాత్రి మారేడ్పల్లి గణేష్ ఆలయం సమీపంలో పెంటప్ప, బ్రూస్ లీ మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటికే పూటుగా తాగి ఉన్న వారు.. ఒకరినొకరు తిట్టుకున్నారు. కోపోద్రిక్తుడైన బ్రూస్ లీ... పెంటయ్యపై బ్లేడుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో పెంటప్ప మెడ, మొహంపై తీవ్ర గాయాలయ్యాయి.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయపడ్డ పెంటప్పను ఆస్పత్రికి తరలించారు. నిందితుడు బ్రూస్ లీని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణ నేలపై డైనోసార్లు