ఐఐటి, హైదరాబాద్ ప్రాంగణంలో “వికీపీడియా సమాచార లభ్యత మరియు సముదాయ అభివృద్ధి” అన్న అంశంపై సదస్సును నిర్వహించారు. వికీపీడియాలో తెలుగు సమాచారాన్ని పెంచేందుకు సంఘటితంగా కృషి చేయాల్సిన అనవసరం ఉందని వక్తలు పేర్కొన్నారు. ఇందుకు “సముదాయ అభివృద్ధి”, “సమాచార లభ్యత”, “శిక్షణ అవగాహన”, “సాంకేతికత”, “పరిశోధన” అనే ఐదు విభాగాల కింద ఈ ప్రయత్నం జరగాలని నిపుణులు సూచించారు.
నాణ్యమైన, విశ్వసనీయమైన సమాచారం కోసం ప్రజలు వికీపీడియాపై ఆధారపడతారని, అందుకే ప్రతీ సెకనుకు సుమారు ఎనిమిది వేల మంది వికీపీడియాను సందర్శిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంకు సంబంధించి అనేక రంగాలకు చెందిన సమాచారం తెలుగులో అందుబాటులో ఉందన్నారు. రాష్ట్ర అవతరణ తర్వాత అనేక పుస్తకాలను ప్రచురించిందని, వాటిని వికీపీడియాలో పొందుపరిచేందుకు అనుమతిచ్చామని భాష, సాంస్కృతిక శాఖ సంచాలకుల శ్రీ మామిడి హరికృష్ణ తెలిపారు.
ఇదీ చూడండి : పబ్బుకి వెళ్లారు... మద్యం తాగారు... క్రేన్‌ను ఢీకొట్టారు...