ఆర్టీసీ సమ్మెకు ముందు.. సమ్మె తర్వాత సిటీ బస్సుల సేవల్లో ఎంత మార్పు వచ్చిందో.. తిరిగి లాక్‌డౌన్‌కు ముందు.. తర్వాత అంతకంటే పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్రధాన రూట్లతోపాటు మెట్రో, ఎంఎంటీఎస్ అనుసంధానమైన ప్రయాణాలకు ప్రాధాన్యం పెరగనుంది. ఆయా స్టాపుల్లో కండక్టర్లను నిలబెట్టి టిక్కెట్లు అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి.
వ్యక్తిగత దూరం పాటిస్తూ టిక్కెట్లు జారీ చేయడం.. బెంగళూరు మాదిరి బస్సు పాస్‌లున్న వారికే ప్రయాణ సౌకర్యం కల్పించడం ఇలా అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. బస్టాపుల్లో వరుసలో నిలబడే విధానం రాబోతోంది.
ఇవీ చూడండి: తెలంగాణలో 4 డేంజర్ జోన్లు..అవి ఏంటో తెలుసా..!