ETV Bharat / state

Lawyers: కరోనాతో మృతిచెందిన న్యాయవాదులకు సంతాపం - బార్ అసోసియేషన్ సభ్యుల సంతాపం

కరోనాతో మరణించిన న్యాయవాదులు, సిబ్బందికి కోర్టుల్లో నివాళులర్పించారు. ఏడాదిగా మహమ్మారితో మృతి చెందిన వారికి నాంపల్లిలోని క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ప్రతినిధులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.

bar assocoation
న్యాయవాదులకు సంతాపం తెలిపిన బార్ అసోసియేషన్ ప్రతినిధులు
author img

By

Published : Jun 4, 2021, 12:52 PM IST

హైకోర్టు పిలుపు మేరకు కొవిడ్​తో మరణించిన న్యాయవాదులకు న్యాయాధికారులు, సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయం ముందు సంతాపం తెలిపారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో సంతాప కార్యక్రమాన్ని చేపట్టినట్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.

న్యాయ వ్యవస్థను కాపాడేందుకు న్యాయవాదులు, సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవ చేశారని కొనియాడారు. విధి నిర్వహణలో కొంతమంది కరోనా బారినపడి మృతి చెందారని పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందిన న్యాయవాదులు, సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వారి కుటుంబాలను ఆర్థికంగా అదుకున్నప్పుడే వారికి నిజమైన నివాళి అర్పించిన వాళ్లమవుతామని సీనియర్ న్యాయవాది నాగేందర్ రెడ్డి అన్నారు.

ఇదీ చూడండి: తెరాస, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్​ రాజీనామా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.