హైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో వైద్య సిబ్బంది ఆందోళన మూడో రోజూ కొనసాగింది. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా.. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న తమను ప్రభుత్వం గుర్తించడం లేదంటూ వైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వైద్యులు తమకు క్వారంటైన్ సెలవులు సైతం ఇవ్వడం లేదంటూ ఆరోపించారు.
ప్రభుత్వం 10 శాతం ఇన్సెంటివ్ ఇస్తానని చెప్పి, మాట తప్పిందని.. వెంటనే ఇన్సెంటివ్తో పాటు క్వారంటైన్ సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.