ETV Bharat / state

మెదడులో కంప్యూటర్​ చిప్​తో మేధస్సు పెంపు - మెదుడుకు కంప్యూటర్​తో అనుసంధానం

మన మెదడులోకి ఒక చిప్‌ను పెట్టి.. ఆలోచనల ద్వారానే కంప్యూటర్‌ లేదా రోబోటిక్‌ చేతుల వంటి పరికరాలను నియంత్రించే అవకాశం ఉంటుందా...? అసలు ఇది సాధ్యమేనా...? ఔనంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్​మస్క్​. దీనిక సంబంధించిన న్యూరోలింక్​ పేరుతో ఓ అంకుర పరిశ్రమ కూడా ఏర్పాటు చేశారు. ఆ వివరాలు మీకోసం...

మెదడుతో కంప్యూటర్​ అనుసంధానం
author img

By

Published : Jul 18, 2019, 10:46 AM IST

మనిషి తన మేధో సామర్థ్యాన్ని కోరుకున్నంత పెంచుకోగల రోజులు దగ్గర్లోనే ఉన్నాయా...? పక్షవాత వ్యాధిగ్రస్థులు తమంతట తాముగా అన్ని పనులు చేసుకోగల మంచి రోజులు రాబోతున్నాయా...? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం చెప్తున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌. కంప్యూటర్లను మనిషి మెదడుతో అనుసంధానించి అతడి మేధో సామర్థ్యాన్ని పెంచే దిశగా తాము చేపట్టిన ప్రయోగాల్లో పురోగతి చోటుచేసుకుందని ఆయన ప్రకటించారు. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో మంగళవారం రాత్రి ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో మస్క్‌ తన ‘న్యూరోలింక్‌’ అంకుర పరిశ్రమ వివరాలు వెల్లడించారు. మానవ మెదడుకు కంప్యూటర్లతో అనుసంధానమే లక్ష్యంగా ఆ సంస్థను ఏర్పాటుచేసి ఇన్నాళ్లూ రహస్య పరిశోధనలు జరిపామన్నారు.

సూక్ష్మ చిప్​ ఆవిష్కరణ

తాము రూపొందించిన సూక్ష్మ సెన్సర్‌(చిప్‌)ను తాజా కార్యక్రమంలో ‘న్యూరోలింక్‌’ ఆవిష్కరించింది. వెంట్రుకంత మందమున్న పోగులతో కూడిన ఈ సెన్సర్‌ను రోబోటిక్‌ టెక్నాలజీ సాయంతో చిన్న కోత ద్వారా మెదడులో ప్రవేశపెడతారు. చెవిలో పెట్టుకునే మరో పరికరంతో ఈ చిప్‌ వైర్‌లెస్‌ పరిజ్ఞానం ద్వారా అనుసంధానమవుతుంది. చెవిలో ఉండే పరికరం స్మార్ట్‌ఫోన్‌లోని యాప్‌నకు సమాచారం చేరవేస్తుంది. ఆలోచనల ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను నియంత్రించగల సామర్థ్యాన్ని ఆవిష్కరించే దిశగా ప్రస్తుతం తాము పనిచేస్తున్నామని మస్క్‌ తెలిపారు. ఈ పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేసి ఆలోచనల ద్వారానే రోబోటిక్‌ చేతుల వంటి ఇతర పరికరాలనూ నియంత్రించగల సామర్థ్యాన్ని కల్పించవచ్చునని అభిప్రాయపడ్డారు. తాము రూపొందించిన చిప్‌ను వచ్చే ఏడాది చివరికల్లా మానవుల్లో ప్రవేశపెట్టి పరిశోధనలు జరుపుతామన్నారు. పక్షవాతం బారినపడ్డవారికి ఇది ప్రయోజనకరంగా మారుతుందన్నారు. కంప్యూటింగ్‌ శక్తిని జోడించి మేధో సామర్థ్యాన్ని పెంచుకోవాలనుకునేవారు ఈ చిప్‌లను మెదళ్లలో చొప్పించుకోవచ్చునని చెప్పారు.

ఇదీ చూడండి : ట్విట్టర్​పై యూజర్ల అసంతృప్తి ఎందుకో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.