శాసనపరిషత్తు ఎన్నికల కోసం ఓటరు నమోదు దరఖాస్తు గడువు ముగిసింది. హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్నగర్, నల్గొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నిక కోసం డినోవా పద్ధతిలో ఓటరు జాబితా తయారీ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ జారీ చేసిన ఈసీ ఆరోజు నుంచి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరించింది.
దరఖాస్తు స్వీకరణ గడువు శుక్రవారంతో ముగిసింది. వాటిని పరిశీలించి డిసెంబర్ 1న ఓటర్ జాబితా ముసాయిదాను ప్రచురిస్తారు. ఆరోజు నుంచి ముసాయిదాపై అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. ఆ గడువులో ఓటరు నమోదు కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యంతరాలు, దరఖాస్తులను స్వీకరించి 2021 జనవరి 18న ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తారు.
ఇదీ చదవండి: ధరణిలో మోసాలు జరిగేందుకు ఆస్కారం!