ETV Bharat / state

సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలపై చర్యలు తీసుకోవాలి - టెక్నాలజీ

మితిమిరిన టెక్నాలజీ వినియోగంతో కొంతమంది యువత తప్పుదారి పడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రముఖుల పేర్లతో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి అశ్లీల వీడియోలు అప్​లోడ్ చేస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ ప్రోగ్రెసీవ్ యూత్ లీగ్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు
author img

By

Published : Jul 21, 2019, 5:34 PM IST

సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు అప్​లోడ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రోగ్రెసీవ్ యూత్ లీగ్ నాయకులు హైద్రాబాద్ సీసీస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలువురు సెలెబ్రిటీల ఫ్యాన్స్ పేరుతో ఫేస్ బుక్​లో నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు

ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్​ ఫ్యాన్స్, తెలుగు బ్యూటీ వంటి ఫేస్​బుక్ గ్రూపులు నిర్వహిస్తున్నారని, షేర్ చాట్​, విడ్ స్టేటస్ వంటి యాప్​ల ద్వారా సైతం అశ్లీల వీడియోలు అప్​లోడ్ చేస్తూ యువతను తప్పు దారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి అసభ్యకరమైన పోస్టింగ్​ల ద్వారా యువత, పిల్లలు చెడు మార్గాల వెపు వెళ్తూ, భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా వీడియోలు పెడుతున్న గ్రూప్ అడ్మిన్ లపై, షేర్ చేస్తున్న నెటిజన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులను కోరారు.

ఇదీ చూడండి : 'నంబర్'​ ప్లేటు మార్చాడు... పట్టుబడ్డాడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.