కరోనా కాలంలో అవిరామంగా పనిచేస్తున్న వైద్యుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అమీర్‌పేటకు చెందిన న్యాయవాది హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కొరతగా ఉన్న మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు కోసం తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ విరాళాలు కోరుతున్నట్లు కొన్ని దినపత్రికలో వచ్చిన కథనాలను తన ఫిర్యాదుతో జాతపరిచారు. ఈ అత్యవసర సమయంలో వైద్యులకు ప్రాథమిక రక్షణ కల్పించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని న్యాయవాది తులసిరాజ్ పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై కమిషన్ జోక్యం చేసుకొని... వైద్యులకు సరిపడా రక్షణ పరికరాలు సరఫరా చేసే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్... ఈ నెల 16లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ హెల్త్ మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్‌కు ఆదేశాలు జారీచేసింది.
ఇదీ చూడండి : 'ధాన్యం సేకరణపై సమస్యలుంటే సంప్రదించండి