ETV Bharat / state

Committee with Six Experts on Medigadda barrage bridge Sagged Incident : 'మేడిగడ్డ' ఘటన.. ఆరుగురు నిపుణులతో కేంద్ర కమిటీ - కేంద్ర జలసంఘం మంత్రికి కిషన్​రెడ్డి లేఖ

Committee with Six Experts on Medigadda barrage bridge Sagged Incident

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 12:22 PM IST

Updated : Oct 23, 2023, 3:13 PM IST

12:17 October 23

Committee with Six Experts on Medigadda barrage bridge Sagged Incident : 'మేడిగడ్డ' ఘటన.. ఆరుగురు నిపుణులతో కేంద్ర కమిటీ

Committee with Six Experts on Medigadda barrage bridge Sagged Incident : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) మేడిగడ్డ బ్యారేజ్​ పిల్లర్లు కుంగిపోవడంతో డ్యామ్​ భద్రతపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజీ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్​కు కిషన్​రెడ్డి లేఖ(Kishan Reddy Letter to Central Water Minister) రాశారు. ఈ లేఖకు స్పందించిన కేంద్రమంత్రి షెకావత్​ కేంద్ర బృందాన్ని పంపాలని నిర్ణయించారు. కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడైన అనిల్​ జైన్​ నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందం నేడు తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమై.. ఆ తర్వాత మంగళవారం కాళేశ్వరం డ్యామ్​ను సందర్శించనున్నారు.

కేంద్ర జల సంఘానికి రాసిన లేఖలో కిషన్​ రెడ్డి.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరమైందని అన్నారు. ఈ బ్యారేజీ పిల్లర్లు 6వ బ్లాకులోని గేట్​ నంబరు 15 నుంచి 20 వరకు కుంగిపోయాయని ఆరోపించారు. పెద్దగా శబ్దాలు వచ్చినట్లు స్థానికులు చెప్పాలని కిషన్​ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. దాంతో బ్యారేజీలోని 85 గేట్లను తెరచి నీటిని దిగువకు విడిచిపెట్టారన్నారు. సుమారు 10 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్లు లేఖలో వివరించారు. ఇలా సాగునీటి కోసం జమ చేసిన నీళ్లన్నీ వృథాకు కిందకి వదిలేయాల్సి వచ్చిందని అన్నారు.

Opposition on Medigadda Project Issue : "మేడిగడ్డ బ్యారేజీపై సమగ్ర విచారణ జరిపించాలి"

Medigadda barrage bridge Issue : ఈ పిల్లర్లు కుంగిపోవడం వల్ల దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రాత్రి సమయంలో భయభ్రాంతులకు గురయ్యారని కిషన్​రెడ్డి లేఖలో వెల్లడించారు. దీని కారణంగా బ్యారేజీ భద్రతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని వాటికి సమాధానంగా.. కేంద్ర బృందాన్ని పంపించి పరీక్షలు నిర్వహించగలరని కేంద్ర జలవనరుల మంత్రిని కోరారు. ఈ లేఖలో "ప్రాజెక్టు నిర్మాణానికి ముందు.. బోర్​ హోల్​ శాంపిల్స్​ తీసుకుని.. భూమి సామర్థ్యాన్ని నిర్ణయించే పరీక్షలు నిర్వహించారా లేక వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తర్వాత ఉన్న పరిస్థితులకు అనుగుణంగా.. పైనుంచి వచ్చే వరద, దిగువకు వదిలే నీటి ప్రవాహానికి సంబంధించి రివర్​ క్రాస్​ సెక్షన్​ పరీక్షలు, అధ్యయనాన్ని నిర్వహించారా? ఇంకా ఏమైనా ఇబ్బందులు గమనించారా.. వంటి వివరాలను" తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​ రెడ్డి పేర్కొన్నారు.

అసలేం జరిగింది : కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ వంతెన శనివారం ఒక్కసారిగా కొంత మేరకు కుంగింది. భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు సమాచారం. బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది.

Bandi Sanjay Reacts on Medigadda Barrage Incident : 'కమీషన్ల మీద ఉన్న శ్రద్ధ.. నాణ్యత పట్ల లేనందునే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంలో పడింది'

Medigadda Barrage Issue Update : 'మేడిగడ్డ బ్యారేజీకి ఎలాంటి ప్రమాదం లేదు.. నెల వ్యవధిలోనే మరమ్మతులు పూర్తి చేస్తాం'

Last Updated : Oct 23, 2023, 3:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.