ETV Bharat / state

రేషన్‌ డీలర్లకు రూ.36.36 కోట్ల కమీషన్‌ విడుదల - ration dealers

రాష్ట్రంలో రేషన్‌ డీలర్లకు ఏప్రిల్‌, మే నెలల కమీషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించి రేషన్‌ డీలర్లకు రూ.36.36 కోట్ల కమీషన్‌ విడుదల చేసినట్లు పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో నేరుగా డీలర్ల ఖాతాల్లో కమీషన్‌ జమ కానున్నట్లు వెల్లడించారు.

commission-released-to-ration-dealers in telangana
రేషన్‌ డీలర్లకు రూ.36.36 కోట్ల కమీషన్‌ విడుదల
author img

By

Published : Jun 26, 2020, 8:35 PM IST

రాష్ట్రంలో ఏప్రిల్, మే మాసాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీ చేసిన రేషన్ దుకాణాల డీలర్లకు కమీషన్ నిధులు విడుదలయ్యాయి. కరోనా మహమ్మారి కట్టడి, లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో పేదలు పస్తులు ఉండరాదన్న ఉద్దేశంతో కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 12 కిలోల బియ్యం, కుటుంబానికి 1500 రూపాయల చొప్పున ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసి ఆదుకుందని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే నెలలో ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించి రేషన్ డీలర్లకు 36.36 కోట్ల రూపాయలు కమీషన్ శుక్రవారం విడుదలైంది.

ఒకట్రెండు రోజుల్లో జిల్లా మేనేజర్ కార్యాలయం నుంచి నేరుగా చౌక ధరల దుకాణాల డీలర్ల బ్యాంకు ఖాతాల్లో ఆ కమీషన్ సొమ్ము జమ చేయనున్నామని మారెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కిలో బియ్యానికి 70 పైసలు, కిలో కందిపప్పుకు 55 పైసల చొప్పున డీలర్లకు చెల్లింపులు చేయనున్నామని చెప్పారు. దారిద్య్ర రేఖకు దిగవనున్న పేద కుటుంబాల సౌకర్యార్థం... ఏప్రిల్ నెలలో 3.18 లక్షలు, మే నెలలో 3.26 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉచితంగా పంపిణీ చేశామని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: అటవీ విస్తీర్ణం పెంచేందుకు పకడ్బందీ ప్రణాళిక: మంత్రి గంగుల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.