ETV Bharat / state

పూర్తైన వాణిజ్య పన్నుల శాఖ పునర్విభజన కసరత్తు - commercial tax department reorganisation

తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ పాలనాపరమైన పునర్విభజన పూర్తయ్యింది. కొత్తగా 18 సర్కిళ్లు , రెండు డివిజన్లతో నేడో, రేపో పునర్విభజనకు చెందిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. హైదరాబాద్‌ రూరల్‌-2, సరూర్‌నగర్‌-2 కొత్త డివిజన్‌లతోపాటు 16సర్కిళ్లకు చెంది నిన్నటి ఉన్నత స్థాయి సమీక్షలో స్పష్టత రాగా మరో రెండు సర్కిళ్ల విషయంలో ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 18 సర్కిళ్లు, 2డివిజన్లతో పునర్విభజన పూర్తయితే.... అన్ని సర్కిళ్లకు సమాన పనివిభజన జరిగి, కొన్ని సర్కిళ్ల, డివిజన్లు పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందనున్నాయి.

commercial tax department reorganisation in telanagana
పూర్తైన వాణిజ్య పన్నుల శాఖ పునర్విభజన కసరత్తు
author img

By

Published : Aug 14, 2020, 1:55 PM IST

Updated : Aug 14, 2020, 3:53 PM IST

ప్రస్తుతం రాష్ట్రంలో 102 వాణిజ్య పన్నుల సర్కిళ్లు, 12 డివిజన్లు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నాయి. అదిలాబాద్‌-4, నిజామాబాద్‌-3, నల్గొండ-6, కరీంనగర్‌-5, అబిడ్స్‌-8, బేగంపేట్‌-7, చార్మినార్‌-11, హైదరాబాద్‌ రూరల్‌-13, పంజాగుట్ట-7, సరూర్‌నగర్‌-14, సికింద్రాబాద్‌-11, వరంగల్‌-13 లెక్కన ఆయా డివిజన్లల్లో సర్కిళ్లు ఉన్నాయి. అయితే ఇందులో కొన్ని డివిజన్లల్లో తక్కువ సంఖ్యలో సర్కిళ్లు, దానికి తోడు తక్కువ సంఖ్యలో పన్ను చెల్లింపుదారులతో చాలా చిన్నవిగా మరికొన్ని డివిజన్లల్లో ఎక్కువ సర్కిళ్లు ఇందుకుతోడు ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులతో పెద్దగా ఉన్నాయి.

ఇందువల్ల చిన్న డివిజన్‌లల్లో, చిన్న సర్కిళ్లలో పని చేసే అధికారులకు చేతి నిండా పనిలేక ఖాళీగా ఉంటే... పెద్ద సర్కిళ్లకు ఉండే అధికారులు, సిబ్బందిపై పని ఒత్తిడి తీవ్రంగా ఉండేది. ఈ పరిస్థితిని గుర్తించిన నాటి వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సర్కిళ్లను ప్రక్షాళన చేయడం ఒకటే మార్గమని నిర్ణయించారు. ప్రధానంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య, అధికారులు, సిబ్బందిపై పని ఒత్తిడి, పాలనాపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను ప్రామాణికంగా తీసుకుని సర్కిళ్లను ప్రక్షాళన చేసే దిశలో పునర్విభజనకు శ్రీకారం చుట్టారు. 2018 మే 22న ఇందుకోసం ప్రత్యేకంగా జీవో 145 ఇచ్చి ప్రక్షాళన చేపట్టారు. తక్కువ పన్ను చెల్లింపుదారులు ఉన్న సర్కిళ్లకు ఎక్కువ మంది చెల్లింపుదార్లను కేటాయించడం, అధిక సంఖ్యలో పన్ను చెల్లింపుదారులు ఉన్న సర్కిళ్లలో సంఖ్యను తగ్గించడం లాంటి కార్యక్రమం చేపట్టారు.

రాష్ట్రంలో మొత్తం 12 వాణిజ్యపరమైన డివిజన్లల్లో అయిదు జిల్లాల్లో ఉండగా మిగిలిన ఏడు డివిజన్లు హైదరాబాద్‌ నగరంలోనే ఉన్నాయి. పునర్విభజన చేసేందుకు ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి కూడా ఆమోదముద్ర వేయడంతో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే దిశలో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. పది కంటే ఎక్కువ సర్కిళ్లతో ఉన్న హైదరాబాద్‌ రూరల్‌, సరూర్‌నగర్‌, వరంగల్‌, సికింద్రాబాద్‌, చార్మినార్‌ డివిజన్లల్లో సర్కిళ్ల సర్దుబాటు తప్పనిసరి అని భావించి ఆ మేరకు చేశారు. ఇందుకు తోడు ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు ఉన్న సర్కిళ్లను, రాష్ట్ర పరిధిలో ఉన్న జిఎస్టీ డీలర్ల సంఖ్య తదితర అంశాలను... పరిగణనలోకి తీసుకుని పెద్ద సర్కిళ్లను విడగొట్టి మరో 18 కొత్త సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

దీంతో ఇప్పుడున్న 102 సర్కిళ్లకు 18 సర్కిళ్లు అదనంగా వస్తుండగా, కొత్తగా సూరూర్‌నగర్‌-2, హైదరాబాద్‌ రూరల్‌-2 ఈ రెండు ఇప్పుడున్న 12వాణిజ్య డివిజన్ల సంఖ్యకు అదనంగా చేరనున్నాయి. దీంతో వాణిజ్య డివిజన్ల సంఖ్య కాస్త 14కు పెరుగుతుంది. సర్కిళ్ల సంఖ్య 120కి చేరనుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఏయే డివిజన్ల పరిధిలో కొత్త సర్కిళ్లు ఏర్పాటు చేయాలి, ఏయే సర్కిళ్ల పరిధిలో ఎన్ని సర్కిళ్లు ఉంచాలి తదితర అంశాలపై గురువారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. కొత్తగా ఏర్పాటవుగున్న18 సర్కిళ్లలో 16 సర్కిళ్లకు చెంది స్పష్టత రాగా మరో రెండు సర్కిళ్ల ఏర్పాటు విషయంలో స్పష్టత రావాల్సి ఉండడంతో శుక్రవారం మరొకసారి చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రక్రియ పూర్తవగానే ఇవాళకాని, రేపుకాని గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

కొత్తగా ఏర్పాటయ్యే డివిజన్లకు, సర్కిళ్లకు అధికారుల, సిబ్బంది కేటాయింపు కూడా జరగాల్సి ఉండడంతో...ఇప్పుడున్న వారినే తాత్కాలికంగా సర్దుబాటు చేసేందుకు తగిన కసరత్తు జరుగుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఒక కమిషనర్‌, ఇద్దరు అదనపు కమిషనర్లు, నలుగురు జాయింట్‌ కమిషనర్లు, 19మంది ఉపకమిషనర్లు, 33 మంది సహాయ కమిషనర్లు, 134 మంది వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, 200 మంది డీసీటీవోలు, 537 మంది ఏసీటీవోలతో సహా అన్ని క్యాటగిరిలు కలిపితే 3585 మంది సిబ్బంది ఉన్నారు. రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాలు జీఎస్టీ అమలుతో ఎత్తివేశారు. దీంతో అక్కడ పని చేసే సిబ్బంది, అధికారులు కొత్తగా ఏర్పాటయ్యే సర్కిళ్లకు, డివిజన్లకు సర్దుబాటు అవుతారని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి చాలా కాలంగా పెండింగ్‌ ఉన్న పెద్ద డివిజన్లను విడగొట్టడం వల్ల పాలనాపరమైన సౌలభ్యత ఏర్పడి ఆయా డిప్యూటీ కమిషనర్లపై పని ఒత్తిడి తగ్గుతుంది. మరొకవైపు పన్ను చెల్లింపుదారుల సంఖ్య హెచ్చు, తగ్గు లేకుండా అన్ని సర్కిళ్లల్లో సమానంగా.... పరిమితంగా ఉంటుండడంతో పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక దృష్టిసారించేందుకు అవకాశం ఏర్పడుతుంది. వాహన తనిఖీలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను సోదాలు విస్తృతంగా చేసి.. ఎగవేతదారులను కట్టడి చేసేందుకు తగినంత సమయం దొరుకుతుందని అధికారులు భావిస్తున్నారు. కిందిస్థాయి అధికారులతో తరచూ సమీక్షలు చేస్తూ...పనితీరును మెరుగు పరచుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు చెబుతున్నారు.

మరొక వైపు వాణిజ్య పన్నుల శాఖలో గత కొన్నేళ్లుగా అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ అవుతున్నారేకాని...కొత్త నియామకాలు జరగలేదు. సాంకేతికపరంగా పనితీరును మెరుగుపరుచుకుంటూ వస్తున్నప్పటికీ... సిబ్బంది కొరత వెంటాడుతూ వస్తోంది. పూర్తి స్థాయిలో ప్రక్షాళన తరువాత....ఇప్పుడున్న అధికారులు, ఉద్యోగులు...కాకుండా కొత్తగా ఎంత మంది అవసరమవుతారు...ఏయే విభాగాల్లో ఎవరి అవసరం ఏ మేరకు ఉంది...కొత్తగా నియమించుకునే వరకు సిబ్బంది కొరత కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను ... ఏ విధంగా అధికమించాలన్న అంశాలపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

Last Updated : Aug 14, 2020, 3:53 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.