Commercial Tax Department plan to increase tax collection: గతంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పన్నుల వసూళ్ల విషయంలో ఎవరు వెనుకబడి ఉన్నారో ఆయా అధికారులతో పన్నుల శాఖ కమిషనర్ మాట్లాడేవారు. తాజాగా 14 రకాల అంశాలను ఎంపిక చేసుకుని ఆయా అంశాలల్లో డివిజన్ల వారీగా పనితీరుపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు రెండు డివిజన్లకు సమీక్షలు నిర్వహిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు.
30నిమిషాల పాటు ప్రజంటేషన్: ప్రధానంగా వృత్తి పన్ను, వ్యాట్, జీఎస్టీ పాత బకాయిలు, ఐటీ రిటర్న్‌లు వేయని వారితో వేయించడం, వ్యాపారం చేస్తూ జీఎస్టీ రిటర్న్‌లు అసలు వేయని వ్యాపార, వాణిజ్య సంస్థలపై అసెస్ చేయడం, రీఫండ్‌లను పరిశీలన చేయడం, వాహన తనిఖీలు, తదితర అంశాలను లోతైన పరిశీలన చేయాలని పన్నుల శాఖ కమిషనర్ ఆదేశిస్తున్నారు. మొదట జాయింట్ కమిషనర్ 30 నిమిషాల పాటు డివిజన్ పరిధిలో ప్రస్తుత పరిస్థితులను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తారు.
వసూళ్లకు తీసుకుంటున్న చర్యలు: డివిజన్ పరిధిలోని పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తారు. అధిక మొత్తంలో జీఎస్టీ చెల్లింపులు చేస్తున్న సంస్థలను ఏయే అధికారి చూస్తున్నారు? ఎక్కడైనా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయా? ఆయా సంస్థలు తీసుకుంటున్న వే బిల్లులు సక్రమంగా పరిశీలన జరుగుతుందా? మొండి బకాయిల వసూళ్లకు తీసుకుంటున్న చర్యలు తదితర అంశాలపై కమిషనర్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
ఏ అంశాలపై సమీక్ష నిర్వహించారు: ఈ నెల, వచ్చే నెల.. రెండు నెలలు మాత్రమే ఉండడంతో అధిక జీఎస్టీ వసూళ్లకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, చెల్లించని సంస్థల నుంచి ఏవిధంగా వసూళ్లు చేయాలి.. మొదలైన అంశాలపై కమిషనర్ దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. వాహన తనిఖీలల్లో పట్టుబడిన సంస్థల ట్యాక్స్, ఫెనాల్టీ చెల్లింపులు జరిగాయా.. అనుమానం ఉన్న సంస్థలపై అసెస్‌మెంట్లు ఎన్ని చేశారు. వాటిలో లోపాలు ఏమైనా గుర్తించారా.. అందుకు సంబంధించి నోటీసులు ఇచ్చి పన్నులు చెల్లించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు.. తదితర అంశాలపై సమీక్ష చేస్తున్నారు.
ఇవీ చదవండి: