ETV Bharat / state

ఆగస్టు 4 నుంచి అందుబాటులోకి కమాండ్ కంట్రోల్ కేంద్రం.. ప్రారంభించనున్న సీఎం - COMMAND CONTROL CENTER AT BANJARA HILLS

అత్యాధునిక సాంకేతికతో.. ఆధునిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకుంటున్న కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు పోలీస్​ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.

కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్..

author img

By

Published : Jul 28, 2022, 1:08 PM IST

దేశంలోనే ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 4న ముఖ్యమంత్రి కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందుకోసం పోలీస్​ శాఖ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు నగర సీపీ సీవీ ఆనంద్ పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ సిటీ పోలీసుల చరిత్ర తెలియజెప్పేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకు అదనపు సీపీ చౌహాన్ బాధ్యుడిగా వ్యవహరించనున్నారు.

ప్రారంభోత్సవంలో పాల్గొనే అతిథుల ప్రొటోకాల్​తో పాటు ఇతర ఏర్పాట్లను అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ చూసుకోనున్నారు. అతిథులుగా ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలతో పాటు ఆడిటోరియానికి సంబంధించి సంయుక్త సీపీ మస్తీపురం రమేశ్​ బాధ్యుడిగా వ్యవహరించనున్నారు. వచ్చిన అతిథులకు జ్ఞాపికలతో పాటు సన్మానం చేసే పనులను సంయుక్త సీపీ విశ్వప్రసాద్ చూసుకోనున్నారు.

గార్డ్ ఆఫ్ హానర్ పనులను సంయుక్త సీపీ కార్తికేయ, ట్రాఫిక్ ప్రొటోకాల్​ను ట్రాఫిక్ అదనపు సీపీ ఏఆర్ రంగనాథ్ చూసుకుంటారు. కమాండ్ కంట్రోల్​లో ప్రదర్శించనున్న వీడియోలను సంయుక్త సీపీ గజరావ్ భూపాల్ పర్యవేక్షించనున్నారు. బందోబస్తును పశ్చిమ మండల డీసీపీ జోయల్ డేవిస్, మ్యూజియంనకు బాధ్యుడిగా మధ్య మండల డీసీపీ రాజేశ్, 7వ అంతస్థులో ఉన్న వీఐపీ గదులకు దక్షిణ మండల డీసీపీ సాయిచైతన్య బాధ్యులుగా వ్యవహరించనున్నారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం అలంకరణ బాధ్యతలు టాస్క్​ఫోర్స్ డీసీపీ సునీతా రెడ్డి, పోలీస్ వర్టికల్స్​ను ఉత్తర మండల డీసీపీ చందనా దీప్తి వివరించనున్నారు.

సందర్శకులకూ అనుమతి..: పోలీస్​ శాఖకే వన్నెతెచ్చేలా రాష్ట్రప్రభుత్వం ఎన్నో ప్రత్యేకతలతో ఈ భవనాన్ని బంజారాహిల్స్‌లో నిర్మించింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఐకానిక్‌ భవనంగా తీర్చిదిద్దింది. రూ.585 కోట్లతో సాంకేతిక హంగులతో దీనిని నిర్మించారు. 19 అంతస్థులున్న ఈ భవనం నుంచి 360 డిగ్రీల కోణంలో భాగ్యనగరాన్ని వీక్షించవచ్చు. ఈ భవనంలో సందర్శకులూ 14, 15 అంతస్థుల వరకు వెళ్లేందుకు అధికారులు అనుమతిస్తారు. అక్కడి నుంచి నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించొచ్చు. టికెట్లు కొన్నవారికే అనుమతి ఉంటుంది. ఆరో అంతస్థులోని కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రానికి వచ్చి బయట నుంచి పోలీసులు చేస్తున్న ఆపరేషన్‌ను వీక్షించేందుకూ పర్మిషన్‌ ఇస్తారు.

ఇవీ చూడండి..

CASINO: ఆడుకుందాం.. నేనెళ్తున్నా.. మీరొస్తారా..!

'అధీర్' వ్యాఖ్యలపై పార్లమెంటులో దుమారం.. మరో ముగ్గురు ఎంపీలపై వేటు​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.