Colony Land issue in Kavali: ఏపీ కాలనీలో తాము నివసిస్తున్న ఇళ్లను రౌడీ మూకలు కూల్చివేసి...ఆ స్థలాలను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆ భూమిని కాపాడాలంటూ బాధితులు నెల్లూరు జిల్లా కావలిలో అధికారి కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. పట్టణానికి చెందిన కొందరు రౌడీమూకలు తమ స్థలాన్ని ఆక్రమించేందుకు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆర్డీవో శ్రీనివాసనాయక్ కాళ్లపై పడి వేడుకున్నారు. రౌడీల బెదిరింపులపై ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజన, యానాది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
ఈ సమయంలో ఆర్డీవో తన ఛాంబర్ నుంచి బయటికి రాగానే...స్థానిక మహిళ అన్నపూర్ణ కుటుంబసభ్యులు ఆయనను చుట్టుముట్టారు. కాళ్లపై పడి స్థలాన్ని కాపాడాలంటూ వాపోయారు. రౌడీల దాడిలో తాము గాయాల పాలయ్యామని వాపోయారు. చికిత్స తీసుకుని వచ్చాక తలదాచుకునేందుకు కనీసం గూడు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై సత్వరం విచారణ జరిపించి, న్యాయం చేస్తానని ఆర్డీవో బాధితులకు హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి :