ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరుగుతోంది. ప్రభుత్వ ప్రాధాన్యతలు, కలెక్టర్ల బాధ్యతలను కేసీఆర్ వివరించారు.
ప్రభుత్వ కార్యక్రమాల అమలే జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత కావాలని సూచించారు. అధికారులు ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదని చెప్పారు.
మేధోమథనం, చర్చోపచర్చల తర్వాత ప్రభుత్వం చట్టాలు తీసుకొస్తుందని పేర్కొన్నారు. విధానాలు రూపొందించి కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మూసి నదీ తీర ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్, జీహెచ్ఎంసీ మేయర్, ఉన్నతాధికారులు హాజరయ్యారు.