ETV Bharat / state

టాలెంట్ టెస్ట్ విజేతలకు బహుమతుల అందజేత

author img

By

Published : Feb 23, 2020, 4:25 PM IST

ఓయూ దూరవిద్యా కేంద్రంలో చుక్కా లక్ష్మీబాయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎల్‌బీ సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష విజేతలకు అవార్డులు ప్రదానం చేశారు. ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పంపిణీ చేశారు.

collector Amrapali awards distributed at OU hyderabad
ఓయూలో అవార్డులు ప్రధానం చేసిన ఆమ్రపాలి
ఓయూలో అవార్డులు ప్రధానం చేసిన ఆమ్రపాలి

ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య చుక్కా లక్ష్మీబాయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీఎల్‌బీ సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష విజేతలకు అవార్డులు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు అవార్డులు అందజేశారు. విద్యా రంగంలో మంచి ఫలితాలు ఎలా సాధించాలి అనే విషయాలపై విద్యార్థులకు ఆమ్రపాలి పలు సూచనలు ఇచ్చారు.

గత 10 ఏళ్ల నుంచి

అవార్డుల ప్రధానోత్సవం గత 10 సంవత్సరాల నుంచి చుక్కా రామయ్య సతీమణి లక్ష్మీ బాయమ్మ పేరిట సీఎల్​బీ పౌండేషన్ వారు నిర్వహిస్తున్నారు. తన భార్య పేరిట నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య అభినందించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మెరుగైన విద్యార్థులను తయారు చేస్తున్నారని కొనియాడారు.

మేధావులను తయారు చేయాలి

చుక్కారామయ్య లాంటి మేధావులను మరింత మందిని తయారు చేయాల్సిన బాధ్యత సీఎల్‌బీ ఫౌండేషన్​పై ఉందని అంబర్​పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి మొత్తం 500 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇదీ చూడండి : కేసీఆర్ ఎర్రవల్లికి సర్పంచా... చింతమడకకు ఎంపీటీసీనా?: రేవంత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.