దేశవ్యాప్తంగా ఈశాన్య రుతుపవనాలు క్రమంగా నిష్క్రమిస్తున్నాయని వాతావరణశాఖ తెలియజేసింది. ప్రత్యేకించి తమిళనాడు, కోస్తాంధ్ర, రాయలసీమ, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి జనవరి 19 నాటికి ఇవి పూర్తిగా వైదొలుగుతాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఉత్తర భారతావనిని తీవ్రమైన చలిగాలులు వణికిస్తున్నాయని ఐఎండీ వివరించింది. మరో మూడు రోజుల పాటు శీతల గాలుల ప్రభావం కొనసాగుతుందని.. దట్టమైన పొగమంచు కూడా కమ్ముకుని ఉంటుందని ఐఎండీ తెలిపింది.
మరోవైపు ఏపీలోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. రాత్రిపూట అత్యల్పంగా అనంతపురంలో 14 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్ఠంగా రాజమహేంద్రవరంలో 35 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. మిగతా చోట్ల సగటున 30 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైనట్టు ఐఎండీ పేర్కొంది.
ఇదీ చదవండి: రాసిపెట్టుకోండి.. సాగు చట్టాలు వెనక్కే: రాహుల్