ఏపీ తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. నువ్వా- నేనా అన్నట్లు పందెం కోళ్లు కొట్లాడుకున్నాయి. నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం ,కొత్తపేట, ఆలమూరు మండలాల్లో ఉదయం నుంచి కోడి పందేలు నిర్వహించారు.
నిమిషాల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు చేతులు మారాయి. వీటితో పాటు గుండాటలు కూడా జోరుగా నిర్వహించారు. ప్రజలు కోడి పందేలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. పందెంరాయుళ్లు రెచ్చిపోయి... పార్టీలకు అతీతంగా కోడి పందాల శిబిరాల ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నారు.
- ఇదీ చూడండి : మకర సంక్రమణ శోభ.. ఉత్తరాయణం ఆగమనం