ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ ఖాతా మిలియన్ మార్క్ ను దాటింది. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2014 జూన్లో సీఎం అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు. ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ ఈ ఖాతాను నిర్వహిస్తోంది. సీఎం అధికారిక సమాచారాన్ని ఖాతా ద్వారా పొందుపరుస్తుంటారు. తెలంగాణ సీఎంఓ ఖాతాను అనుసరిస్తున్న వారి సంఖ్య పది లక్షల మార్కును దాటింది.
మిలియన్ మార్కును చేరిన విషయాన్ని ట్విట్టర్ ఖాతాలో పొందుపరిచారు. 1,000 మంది ప్రజల్లో ఫాలో అవుతున్న వారిని పరిగణలోకి తీసుకుంటే దేశంలో ఎక్కువ మంది అనుసరిస్తున్న ముఖ్యమంత్రి ఖాతాగా అందులో పేర్కొన్నారు.