ETV Bharat / state

'ఏరియా జీఎంలతో సీఎండీ సమీక్ష... మైనింగ్ మ్యాప్ కావాలి'

అధిక బొగ్గు ఉత్పత్తే లక్ష్యంగా నల్ల సిరుల వేణి సింగరేణి ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 670 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఒడిశాలోని నైనీ బొగ్గు గనిలో... ఉత్పత్తికి అవసరమైన చర్యలను వెంటనే  చేపట్టాలని అధికారులను  సీఎండీ శ్రీధర్ ఆదేశించారు. ఒడిశాలోని న్యూ పాత్రపాద గనిలోనూ డ్రిల్లింగ్ ప్రారంభించాలని ఆదేశించారు.

' 670 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం'

author img

By

Published : Feb 5, 2020, 6:10 AM IST

Updated : Feb 5, 2020, 7:07 AM IST

సింగరేణి ఏరియా జీఎంలతో సంస్థ సీఎండీ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం 2020-21లో 670 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ నిర్ణయించింది. 450 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఓబీని సైతం తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. ఐదు కొత్త ఉపరితల గనుల నుంచి అదనంగా 50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కిష్టారం గని నుంచి 16 లక్షల టన్నులు, VKOC నుంచి 10 లక్షల టన్నులు, మేడేపల్లి నుంచి 6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కోసం వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఒడిశాలో సింగరేణికి కేటాయించిన నైనీ, న్యూ పాత్రపాద గనుల్లో ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు సీఎండీ తెలిపారు.

ప్రత్యేక రైల్వే లైన్...

సుమారు 350 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న నైనీ గనిలో... 2021 మార్చి నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. 50 లక్షల టన్నులు ఉత్పత్తి చేయాలని సీఎండీ అధికారులకు లక్ష్యం నిర్దేశించారు. వేగం పుంజుకున్న తర్వాత... 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ తలుస్తోంది. నైనీ బ్లాకు నుంచి పెద్ద ఎత్తున బొగ్గు ఉత్పత్తి జరగనుండగా... కోల్ ఇండియాతో కలిసి ప్రత్యేక రైల్వే లైను ఏర్పాటు చేయాలని సింగరేణి తలచింది.

ఏజెన్సీని నియమించాలి !!

నైనీ గని కోసం అంగూల్ జిల్లాలో 783 హెక్టార్ల అటవీ భూముల సేకరణకు రూ.450 కోట్లను... వచ్చే బోర్డు సమావేశంలో కేటాయిస్తామని ఆయన తెలిపారు. మూడు గ్రామాల్లో భూముల సేకరణ, ఇతర అనుమతుల ప్రక్రియను జూన్‌ వరకు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గని అభివృద్ధి, నిర్వహణ కోసం జూన్ లేదా జులైలో ఏజెన్సీని నియమించాలని సింగరేణి ఆదేశించింది.

బొగ్గు నిల్వలతో మ్యాప్ కావాలి...

ఒడిశాలో సింగరేణికి కేటాయించిన... సుమారు వెయ్యి మిలియన్ టన్నుల నిల్వలున్న న్యూ పాత్రపాద బ్లాక్‌లోనూ డ్రిల్లింగ్ పనులు ప్రారంభించాలని సీఎండీ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక అనుమతుల తర్వాత ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా డ్రిల్లింగ్‌ చేపట్టి... బొగ్గు నిల్వల సమాచారంతో మైనింగ్‌ మ్యాప్‌ రూపొందించాలన్నారు.

' 670 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం'

ఇవీ చూడండి : పీఎన్​బీ: త్రైమాసిక ఫలితాల్లో రూ.492 కోట్లు నికర నష్టం

Last Updated : Feb 5, 2020, 7:07 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.