రవాణా మార్గాల ప్రైవేటీకరణ వ్యవహారంపై అధికారులు, న్యాయవాదులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కేజోషి, రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్ రావుతో ప్రగతి భవన్లో కేసీఆర్ సమావేశమయ్యారు. రూట్ల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి న్యాయస్థానం లేవనెత్తిన అంశాలు, ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన వివరణపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
ఇవీ చూడండి: 'శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ