ప్రగతిభవన్‌లో నీటిపారుదలశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి ఎత్తిపోతలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి అధికారులకు, ఇంజినీర్లకు పలు సూచనలు చేశారు. జులై నుంచే కాళేశ్వరం నుంచి నీరు ఎత్తిపోయడం ప్రారంభించాలని ఆదేశించారు. బ్యారేజిలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్వహణకు సన్నద్ధం కావాలని.. డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణకు సర్వం సన్నద్ధం కావాలని సీఎం సూచించారు. కాల్వల నిర్వహణకు సమగ్ర వ్యూహం రూపొందించాలని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో నిరంతర నీటి ప్రవాహం ఉంటుందని కేసీఆర్ తెలిపారు.
ఇవీ చూడండి: 'ఓటమి గెలుపునకు తొలిమెట్టు... బాధ్యతతో పనిచేస్తాం'