CM Revanth Reddy warns on Drugs and Fake seeds : రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదం వినిపించేందుకు వీల్లేదని పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) స్పష్టం చేశారు. చిన్న చిన్న పట్టణాలు, పాఠశాలల్లోనూ గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయన్నారు. పంజాబ్ వంటి పరిణామాల వైపు తెలంగాణ వెళ్తోందని, ఇది ప్రమాదకరమని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Meeting Today : డ్రగ్స్‌పై సమాచారం కోసం ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని పోలీసులకు సీఎం సూచించారు. ఏవోబీ సరిహద్దు నుంచి గంజాయి ఎలా వస్తుందో తెలుసుకోవాలని చెప్పారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను దుర్వినియోగం చేస్తే ఉపేక్షించవద్దని పోలీసులకు స్పష్టం చేశారు. పోలీసులకు సంపూర్ణ స్వేచ్ఛనిస్తున్నామని భూకబ్జాదారులు, డ్రగ్స్ మాఫియా(Drugs), నకిలీ విత్తనాల రాకెట్లను ఉక్కుపాదంతో అణచి వేయాలని సీఎం సూచించారు.
సైబర్ నేరాలు అతిపెద్ద సవాల్‌గా మారాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సంప్రదాయ నేరాల తీరు మారి ఇప్పుడు సైబర్ నేరాల వైపునకు వెళ్లాయన్నారు. సైబర్ నేరాల నియంత్రణ వ్యవస్థను పటిష్టం చేయాలని పోలీసులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. నకిలీ విత్తనాలు టెర్రరిజం కన్నా ప్రమాదకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేట, గజ్వేల్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth orders Police to Ban Sunburn Parties : రైతు ఆత్మహత్యలు(Farmer Suicides) పెరగడంలో నకిలీ విత్తనాలు ప్రధాన కారణమన్నారు. నకిలీ విత్తనాల విక్రయాలను పూర్తిగా అరికట్టాలని, కంపెనీల యాజమాన్యాలను బాధ్యులను చేయాలని సీఎం ఆదేశించారు. అనుమతి లేకుండా సన్‌బర్న్, నూతన సంవత్సర ఈవెంట్ టికెట్లు ఎలా అమ్ముతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దెనిమిదేళ్ల లోపువారికి మద్యం అమ్మవద్దని నిబంధనలు ఉంటే పాఠశాల విద్యార్థులకు రాయితీ ఇచ్చి మరీ ప్రోత్సహించడమేంటన్నారు.
సన్‌బర్న్, బుక్ మైషో ఎవరు నిర్వహిస్తున్నారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ను(Cyberabad CP) రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సన్‌బర్న్ ఈవెంట్‌ను గోవాలో నిషేధించగా గతంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చి రద్దు చేశాయని పోలీసులకు సీఎం తెలిపారు. సోషల్ మీడియాలో వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్న వారిని దారికి తేవాలని ముఖ్యమంత్రి చెప్పారు.
ఔటర్‌కు బయట, రీజినల్ రింగ్‌రోడ్‌కు లోపల భూములు సేకరించండి : రేవంత్‌రెడ్డి