ETV Bharat / state

ఇప్పుడైనా ఇతరులకు అవకాశం ఇస్తారనుకుంటే మళ్లీ వారే మాట్లాడుతున్నారు : రేవంత్​ రెడ్డి - సీఎం రేవంత్​ రెడ్డి స్పీచ్​

CM Revanth Reddy Speech in Telangana Legislative Assembly : ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు తాము మళ్లీ ధర్నాచౌక్​ను పునరుద్ధరించామని, ఇప్పుడు కేటీఆర్​, బీఆర్​ఎస్​ నేతలు అక్కడ ధర్నా చేసుకోవచ్చని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. కుటుంబపాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చినా బీఆర్​ఎస్​లో ఏమాత్రం మార్పు కనిపించడం లేదన్నారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Speech in Telangana Legislative Assembly
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2023, 4:33 PM IST

Updated : Dec 16, 2023, 6:48 PM IST

CM Revanth Reddy Speech in Telangana Legislative Assembly : కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారని, ఇకనైనా బీఆర్​ఎస్​లో మార్పు వస్తుందని ఆశించానని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. ఇప్పుడైనా శాసనసభలో ఇతరులకు అవకాశం ఇస్తారకున్నానని, కానీ ఇప్పుడు కూడా ఒక కుటుంబ సభ్యులే మాట్లాడుతున్నారన్నారు. శాసనసభలో గవర్నర్​కు ధన్యవాదాలు తెలిపే సమావేశంలో సీఎం ప్రసంగించారు.

మా పార్టీ, మా ఇష్టం అనేది ప్రజాస్వామ్యంలో ఎక్కువ కాలం చెల్లదని సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి భవన్​ గడీలు బద్ధలు కొట్టాక ప్రజలు భారీగా తరలివస్తున్నారన్నారు. గతంలో ప్రగతిభవన్​లోకి నాటి హోంమంత్రికి కూడా ప్రవేశం లేదని చెప్పారు. హోంమంత్రిని ఒక హోంగార్డు అడ్డుకుని వెనక్కి పంపిన ఘనత బీఆర్​ఎస్​ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. అలాగే ప్రజా యుద్ధనౌక గద్దర్​ అన్న సైతం ప్రగతిభవన్​ ముందు గంటల కొద్దీ నిలబడ్డారని నాటి విషయాలను గుర్తు చేశారు. ప్రజాభవన్​కు ప్రజలు వచ్చి విజ్ఞప్తులు ఇస్తుంటే బీఆర్​ఎస్​ నేతలు సహించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. మొన్నటి వరకు సీఎంను కలవాలంటే మంత్రులకు కూడా అవకాశం ఉండలేదన్నారు.

సమీక్షలు, సమావేశాలు, ఆదేశాలు - పాలనపై తనదైన ముద్ర వేస్తున్న సీఎం రేవంత్​ రెడ్డి

Telangana Legislative Assembly Sessions : ఇప్పుడు ఎవరు వచ్చినా, ప్రజల సమస్యలు వినేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్​ రెడ్డి సభలో స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సభలో నిరసన తెలిపినందుకు ఇద్దరు సభ్యుల సభ్యత్వాన్నే రద్దు చేసిందని పేర్కొన్నారు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించామని చెప్పారు. అందుకు తగిన కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. అమరవీరుల కుటుంబీకులను ఎప్పుడైనా ప్రగతిభవన్​లోకి పిలిపంచుకున్నారా అంటూ ప్రశ్నించారు.

'పదేళ్లు అధికారంలో ఉండి తెలంగాణ ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయలేదు. ధర్నాచౌక్‌ ఎత్తివేసి తెలంగాణ ప్రజలు ధర్నా చేసుకునే అవకాశం లేకుండా చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టేందుకు మేం మళ్లీ ధర్నాచౌక్‌ను పునరుద్ధరించాం. కావాలనుకుంటే ఇప్పుడు కేటీఆర్‌, బీఆర్​ఎస్​ నేతలు ధర్నాచౌక్‌లో ధర్నా చేసుకోవచ్చు. రైతుల ఆదాయంలో తెలంగాణ 25వ స్థానంలో ఉంది. గత పదేళ్లలో 8 వేలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఎన్‌సీఆర్‌ నివేదిక చెప్పింది. రైతుబీమా కింద 1.21 లక్షల మంది రైతులకు పరిహారం ఇచ్చారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే ఆత్మహత్యలు జరిగి ఉండేవి కావు'- సీఎం రేవంత్​ రెడ్డి

ఇప్పుడైనా ఇతరులకు అవకాశం ఇస్తారనుకుంటే మళ్లీ వారే మాట్లాడుతున్నారు రేవంత్​ రెడ్డి

కుటుంబ సభ్యులకు పదవులు : ఉద్యమంలో బిడ్డలను కోల్పోయిన వారి కుటుంబాలను ఎప్పుడైనా ఆదుకున్నారా అంటూ సీఎం రేవంత్​ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. తన కుటుంబంలోని కుమారుడు, కుమార్తె, బంధువులకు మాత్రం పదవులు ఇచ్చుకున్నారన్నారు. తన కుమార్తె ఎన్నికల్లో ఓడిపోతే వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం డీఎస్పీ ఉద్యోగం వదులుకున్న నళినికి ఏమైనా న్యాయం చేశారా అంటూ గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

రేవంత్​ రెడ్డి వర్సెస్​ కేటీఆర్ - శాసనసభలో వాడీవే'ఢీ' చర్చ

రేషన్ బియ్యాన్ని 70శాతం కుటుంబాలు తినడం లేదు : ఉత్తమ్​కుమార్​ రెడ్డి

Last Updated : Dec 16, 2023, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.