ETV Bharat / state

ఎన్నికల్లో ఓడినా బీఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదు - వారి విమర్శలను దీటుగా తిప్పి కొట్టాలి : సీఎం రేవంత్​ - TPCC Meeting

CM Revanth Reddy Speech at TPCC Meeting : హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో మూడు తీర్మానాలను ఆమోదించారు. ఈ తీర్మానాల్లో సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. ఈ సమావేశానికి సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అధ్యక్షత వహించారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Speech at TPCC Meeting
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 3, 2024, 9:44 PM IST

CM Revanth Reddy Speech at TPCC Meeting : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి సోనియా గాంధీ(Sonia Gandhi)ని పోటీ చేయాలని కోరుతూ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి తీర్మానం చేశారు. దీనితో పాటు మరో రెండు తీర్మానాలను ఈ సమావేశంలో సీఎం ప్రతిపాదించారు. హైదరాబాద్‌లోని ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మొదటి తీర్మానంగా ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీకి అభినందనలు చెప్పారు. ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో సమన్వయంతో పని చేసిన మాణిక్‌ రావు ఠాక్రేకు అభినందనలు తెలుపుతూ రెండో తీర్మానం చేశారు.

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తించి, వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత తమదని పేర్కొన్నారు. ఎన్నికల్లో బోర్లా పడి బొక్కలు విరిగినా బీఆర్‌ఎస్‌కు బుద్ధి రాలేదని విమర్శించారు. నెల రోజులు గడవక ముందే కాంగ్రెస్‌ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నారని మండిపడ్డారు. చెరుకు తోటల్లో పడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్‌ఎస్‌ దోచుకుందని అన్నారు.

ప్రజాపాలనకు వస్తున్న స్పందన చూసి బీఆర్ఎస్​కు నిద్ర పట్టడం లేదు : మంత్రి పొన్నం

ఇక నుంచి బీఆర్‌ఎస్‌ విమర్శలను దీటుగా తిప్పి కొట్టాలని పీసీసీ సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ప్రతి ఒక్కరు టార్గెట్‌ 17 పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో 12కు తగ్గకుండా లోక్‌సభ స్థానాలు గెలుచుకోవాలన్నారు. ఈ నెల 8న ఐదు జిల్లాలు, 9వ తేదీన మరో ఐదు జిల్లాల నేతలతో సమీక్షిస్తానని సీఎం రేవంత్‌ చెప్పారు. ఈ నెల 10 నుంచి 12 వరకు 17 పార్లమెంటు ఇంఛార్జీలతో సన్నాహక సమావేశం నిర్వహిస్తానని తెలిపారు. ఈ నెల 20 తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనల్లో పాల్గొంటానని సీఎం పేర్కొన్నారు.

TPCC Meeting in Hyderabad : ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డిపై సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డికి ఆదాయం తగ్గినట్లు ఉందని, అందుకే కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వయిరీ కోరుతున్నారని ధ్వజమెత్తారు. అనాడు తాను స్వయంగా సీబీఐ ఎంక్వయిరీ కోరినప్పుడు ఏం చేశారని దుయ్యబట్టారు. దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్‌ రెడ్డి అడుగుతున్నారన్నారు. కాళేశ్వరం అవినీతిపై తాము జ్యుడీషియల్‌ విచారణ చేసి తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలు, ఇద్దరూ కలిసే కాళేశ్వరం పేరుతో దోచుకున్నారు, పాలమూరు ఎత్తిపోతలకు అన్యాయం చేశారని ఆరోపించారు.

అదానీ గ్రూప్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం : సీఎం రేవంత్ రెడ్డి

ముగిసిన టీపీసీసీ సమావేశం- పార్లమెంట్​ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందడుగుకు శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.