ETV Bharat / state

పెండింగ్​లో రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో, కొత్త మార్గాలపై సర్వేకు నిర్ణయం - cm review on metro

CM Revanth Reddy Review on Metro Railway : హైదరాబాద్ మెట్రో రైల్వేపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం-ఎయిర్​పోర్టు మెట్రో ప్రతిపాదనను పక్కన పెట్టాలని అధికారులకు ఆదేశించారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Review on Metro Railway
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 2, 2024, 3:59 PM IST

Updated : Jan 18, 2024, 3:16 PM IST

CM Revanth Reddy Review on Metro Railway : ఎక్కువ మంది ప్రజలకు, ప్రాంతాలకు ఉపయోగపడేలా హైదరాబాద్ మెట్రోరైలు(Hyderabad Metro) విస్తరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో రైలు రెండో దశ ప్రతిపాదనలను మెరుగుపరచాలని ఆదేశించారు. గత ప్రభుత్వం సుమారు రూ.6,250 కోట్లతో రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు 31 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రతిపాదనలను పక్కన పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఆ మార్గంలో ఓఆర్ఆర్ ఉన్నందున దానికి బదులుగా ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా విమానాశ్రయానికి ప్రణాళిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. అదేవిధంగా నాగోల్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కు కలిపి అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రతిపాదనలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సవరించిన ఎయిర్ పోర్టు మెట్రో కారిడార్ ను డీపీఆర్, ట్రాఫిక్ అధ్యయన నివేదికలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని ఆదేశించారు. పాతబస్తీలో రోడ్డు విస్తరణ, మెట్రో రైలు నిర్మాణంపై స్థానిక ప్రజా ప్రతినిధులతో చర్చించాలని అధికారులకు సీఎం తెలిపారు. అవసరమైతే తాను కూడా వ్యక్తిగతంగా పాల్గొంటానని రేవంత్ రెడ్డి చెప్పారు.

Hyderabad Metro Railway Review : మెట్రో రైలుతో పాటు దారుల్ షిఫా నుంచి ఫలక్ నుమా వరకు వంద అడుగుల రోడ్డు విస్తరణ చేసినట్లు నగరంలోని మిగతా ప్రాంతాల మాదిరిగా పాతబస్తీ అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రోడ్డు విస్తరణ కోసం 103 చారిత్రక, మతపరమైన కట్టడాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లక్ష్మీగూడ నుంచి జల్ పల్లి మీదుగా మామిడిపల్లి వరకు మెట్రోరైలు(Metro Rail)ను కొంత రోడ్డుకు సమాంతరంగా నిర్మించడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దానివల్ల ఖర్చు తగ్గుతుందని ఆ మార్గంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించాలన్నారు.

ప్రస్తుత మెట్రో కారిడార్లను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మియాపూర్ నుంచి చందానగర్, బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్ చెరు, ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా, చంద్రాయణగుట్ట, మైలార్ దేవ్ పల్లి, మీదుగా ఎయిర్ పోర్టుకు, నాగోల్ నుంచి ఎల్ బీనగర్, ఓవైసీ ఆస్పత్రి, చంద్రాయణగుట్ట, మైలార్ దేవ్ పల్లి, ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్​లో నిర్మించిన కొత్త హైకోర్టు వరకు, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ వరకు మెట్రో విస్తరించాలని సీఎం చెప్పారు.

CM Revanth Reddy Review : మెట్రో విస్తరణపై కేంద్ర పట్టణావృద్ధి శాఖ మంత్రి హర్ దీప్ సింగ్​కు రాసేందుకు లేఖను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెగా టౌన్ షిప్ నిర్మించనున్న కందుకూరుకు మెట్రో రైలు కనెక్టివిటీ ప్రణాళిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూడో దశలో జేబీఎస్ నుంచి శామీర్ పేట వరకు, ప్యారడైజ్ స్టేషన్ నుంచి మేడ్చల్ కండ్లకోయ వరకు మెట్రో విస్తరణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

పారిశ్రామిక రంగంలో మహిళలను మరింత ప్రోత్సహిస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

Last Updated : Jan 18, 2024, 3:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.