ETV Bharat / state

కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి - సీఎం మేడిగడ్డ సమస్యపై ఇంజనీర్లతో చర్చ

CM Revanth Reddy Review on Irrigation Projects : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో కుంగిన మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పూర్తి వివరాలివ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బ్యారేజీ కుంగడంపై వాస్తవాలను తేల్చేందుకు జ్యూడిషియల్‌ విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. 21న శాసనసభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. యాసంగి పంటలకు నీళ్లిచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Judicial Inquiry on Medigadda Barrage
CM Revanth Reddy Review Meeting on Irrigation Department
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 18, 2023, 8:10 AM IST

కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలి : సీఎం

CM Revanth Reddy Review on Irrigation Projects : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి సీఎం తన నివాసంలో ఇంజినీర్లతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

CM Revanth On Medigadda Barrage Damage : బ్యారేజీకి సంబంధించి నిర్మాణ సంస్థ నీటిపారుదలశాఖకు రాసిన లేఖపై న్యాయపరంగా తీసుకోనున్న చర్యలను ఇంజినీర్లు ముఖ్యమంత్రికి వివరించారు. శాఖ నుంచి నిర్మాణ సంస్థకు జారీ చేసిన లేఖకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి? ఆ సంస్థతో ఒప్పందం ఎలా జరిగింది? బ్యారేజీని పునరుద్ధరించేందుకు చేపట్టాల్సిన చర్యలేమిటి? ముందుకెళ్లడానికి ఉన్న వనరులు ఏమిటనే అంశాలపై సీఎం ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై వాస్తవాలను తేల్చేందుకు జ్యుడీషియల్‌ విచారణ చేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. 21న శాసనసభ సమావేశాల అనంతరం ఈ మేరకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.

వర్షాకాలంలోగా మేడిగడ్డ పునరుద్ధరణ కష్టమే - ఆందోళనలో నీటిపారుదల శాఖ

Cm Revanth Reddy Review On Kaleshwaram Project : రాష్ట్రంలో యాసంగి పంటలకు సాగునీరిచ్చేందుకు ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యతపై సీఎం సవివరంగా చర్చించారు. గోదావరి పరీవాహకంలో నీటి విడుదలకు ఇబ్బందులేమీ లేవని, కృష్ణా ప్రాజెక్టుల కింద సమస్య ఉందని ఇంజినీర్లు వివరించారు. వానాకాలం పంటలకు నీటి విడుదల సందర్భంగా యాసంగి పరిస్థితులను రైతులకు ముందుగా ఎందుకు వివరించలేదని సీఎం ప్రశ్నించారు. రాష్ట్రంలో అప్పుల కారణంగా విద్యుత్‌ సరఫరాకు సమస్యలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేని కారణంగా సాగుకు ఇబ్బందులు, రాష్ట్ర వ్యయాలకు సంబంధించి అప్పుల కారణంగా నిధుల వెసులుబాటుకు సమస్యలు ఉన్నాయని ప్రజలకు అధికారులు ఎందుకు ముందుగా వివరించలేదని సీఎం పేర్కొన్నారు. పంటలకు సాగునీటిని విడుదల చేయలేమని రైతులకు ముందుగా ఎందుకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'మేడిగడ్డ' ఘటనలో ఊహించని ట్విస్ట్ - పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ నిర్మాణ సంస్థ లేఖ

Judicial Inquiry on Medigadda Barrage : కృష్ణా పరీవాహకంలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు లేకుండా ఎగువన ఉన్న కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలని నిర్ణయించారు. కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి తెలంగాణ తాగునీటి అవసరాల కోసం కొంత నీటిని విడుదల చేయాలని మంత్రి నేతృత్వంలో త్వరలో ఒక బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపాలని సూచించారు. గతంలో కూడా రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి ఏర్పడినప్పుడు కర్ణాటక సహకారం అందించిన దాఖలాలున్నాయని ఇప్పుడు ఆ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండటం కలిసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

Revanth Reddy on Medigadda Barrage : రాష్ట్రంలో సాగునీటి పారుదల రంగం ప్రాజెక్టుల నిర్మాణం, వ్యయం, అప్పులు తదితర అంశాలపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎం నీటి పారుదల శాఖను ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రైబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అంతర్రాష్ట్ర జలవివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్​ రెడ్డి

మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తాం : రేవంత్‌రెడ్డి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.