ETV Bharat / state

నీటిపారుదల రంగంపై సర్కార్ ఫోకస్ - నేడు సీఎం రేవంత్ సమీక్ష - నీటిపారుదల రంగంపై సీఎం

CM Revanth Reddy Review on Irrigation Department Today : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడం సహా తుది దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై సర్కార్ దృష్టి పెట్టింది. నీటిపారుదల శాఖపై ఇప్పటికే సీఎంతో పాటు నీటిపారుదల శాఖ మంత్రి పలుమార్లు సమావేశాలు నిర్వహించగా, ఇవాళ మరోసారి రేవంత్‌రెడ్డి, ఉత్తమ్​కుమార్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.

CM Revanth Reddy Review on Irrigation Department
CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 9:48 AM IST

Updated : Jan 7, 2024, 10:02 AM IST

CM Revanth Reddy Review on Irrigation Projects Today : తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించడం, తుది దశలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలుమార్లు నీటిపారుదల శాఖపై సీఎం, మంత్రి సమావేశాలు నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ఆదివారం మధ్యాహ్నం తొలుత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్‌ రెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మరోసారి సమీక్ష నిర్వహించనున్నారు.

CM Revanth Irrigation Projects Review Meeting : ఈ నేపథ్యంలో ఆరు నెలలు, ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు ఇలా నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయగలిగిన ప్రాజెక్టుల జాబితాను ఆ శాఖ సిద్ధం చేసింది. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేస్తే ఎంతకాలంలో ఆయకట్టు సాగులోకి తీసుకురావచ్చన్న కోణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తుండటంతో, ఆ మేరకు నివేదికలు రూపొందించింది. ప్రాజెక్టులు, కాలువలు, పంప్‌హౌస్‌లు, డిస్ట్రిబ్యూటరీలు, ప్రాజెక్టుల వెనుక భాగంలో ఉన్న, సాగునీరు అందని (గ్యాప్‌) ఆయకట్టుకు ఎలా నీరందించాలి, చిన్నతరహా ఎత్తిపోతల నిర్మాణాలు ఎక్కడ చేపట్టాలనే వివరాలనూ నీటిపారుదల శాఖ సిద్ధం చేసినట్లు తెలిసింది.

'తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం - విభజన చట్టంలో రావాల్సిన హక్కులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది'

ఆ టెండర్లకు సర్కార్ స్వస్తి! : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో(Palamuru Rangareddy Lift Irrigation Scheme) గతేడాది చివర్లో పిలిచిన కాలువల టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. వట్టెం, కరివెన, ఉదండాపూర్‌ జలాశయాల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం గతేడాది 11 టెండర్లను సిద్ధం చేయగా, అందులో ఏడింటికి ప్రాధాన్యం ఇచ్చింది. రూ.3747.49 కోట్లతో ఉదండాపూర్‌ కింద ఐదు పనులు, కరివెన కింద రెండు పనులకు గత సెప్టెంబరులో టెండర్లు పిలిచింది. కాగా అక్టోబరు రెండోవారంలో వాటిని తెరిచింది.

ఏడు పనులకు సంబంధించి సాంకేతిక బిడ్లను తెరిచి, వాటిని కమిషనర్‌ ఆఫ్‌ టెండర్స్‌కు కూడా పంపించి ఆమోదం తీసుకుంది. పనులపై నిర్మాణ సంస్థలు, ప్రాజెక్టు ఇంజినీర్లకు మధ్య ఒప్పందం కుదరాల్సి ఉండగా, అంతలో ఎన్నికల కోడ్‌ (Telangana Election Code) అమలులోకి రావడంతో ఆ ప్రక్రియ కాస్త నిలిచిపోయింది. ఎన్నికల అనంతరం కొలువుదీరిన కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం నీటిపారుదల శాఖలో టెండర్ల దశలో ఉన్న పనులను నిలిపివేయాలని గత నెల మొదటి వారంలోనే ఆదేశించింది.

CM Revanth Review Meeting on Irrigation Department : దీంతో పాలమూరు ఎత్తిపోతల టెండర్ల ఒప్పందం విషయంలో ఇంజినీర్లు ముందడుగు వేయలేదు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించనున్నట్లు సర్కార్ ప్రకటించింది. ఉదండాపూర్‌, వట్టెం జలాశయాల నుంచి నిర్మించనున్న కాలువల కింద రంగారెడ్డి జిల్లా ఆయకట్టు ఉండగా, ఆ కాలువల నిర్మాణాల ఎలైన్‌మెంట్‌ను మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉదండాపూర్‌ జలాశయం నిల్వ సామర్థ్యాన్నీ కుదించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి - కేంద్రానికి సీఎం విజ్ఞప్తి

హైదరాబాద్​ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్​ - మూసీ నది అభివృద్ధే ప్రధానం

Last Updated : Jan 7, 2024, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.