ETV Bharat / state

నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్​ డెవలప్​మెంట్​ నిధులు : సీఎం రేవంత్ రెడ్డి - Godrej meet revanth

CM Revanth Reddy Review on Five Old Districts Leaders : ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్​ డెవలప్​మెంట్​ నిధులు కేటాయించి, బాధ్యులుగా ఇంఛార్జ్​ మంత్రులు ఉంటారని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని సూచించారు. సచివాలయంలో ఉమ్మడి ఐదు జిల్లాల ఇంఛార్జ్​ మంత్రులతో సీఎం సమీక్ష నిర్వహించారు. అలాగే గోద్రెజ్​ ఆగ్రోవెట్​ సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్​ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

CM Revanth Reddy Review on Five Old Districts Leaders
CM Revanth Reddy
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 9, 2024, 8:20 PM IST

CM Revanth Reddy Review on Five Old Districts Leaders : ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్​ డెవలప్​మెంట్​ నిధులు కేటాయిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్​ మంత్రులకు ఈ నిధుల బాధ్యత అప్పగిస్తున్నామని అన్నారు. హైదరాబాద్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో జరిగిన ఖమ్మం, వరంగల్​, కరీంనగర్​, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఇంఛార్జ్​ మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో వారికి దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం రేవంత్​ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో(Lok Sabha Election 2024) గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పారు. ఈ క్రమంలో ఇంఛార్జ్​ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని, సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు.

12 లోక్​సభ స్థానాలపై కాంగ్రెస్​ గురి - ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో సీఎం రేవంత్​ రెడ్డి పర్యటన

నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సీఎం రేవంత్​ రెడ్డి జిల్లాల ఇంఛార్జ్​లు, ఎమ్మెల్యేలకు తెలిపారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, సంక్షేమ పథకాలను(Telangana Schemes) ప్రజలకు చేరుస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో నిజాయతీ, నిబద్ధత ఉన్న అధికారులను నియమించుకోవాలని వారికి సూచించారు. ప్రతి శాఖలో అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని హెచ్చరించారు. అధికారులు, పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని ఈ ఐదు జిల్లాల ఇంఛార్జ్​లకు, ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్​ రెడ్డి హితవు పలికారు.

Godrej Company Representatives Meets With CM Revanth Reddy : రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం, ఫర్నీచర్​ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని గోద్రెజ్​ అగ్రోవెట్​(Godrej Agrowet) ప్రతినిధులను సీఎం రేవంత్​ రెడ్డి కోరారు. గోద్రెజ్​ అగ్రోవెట్​ ఎండీ బలరాంసింగ్​ నేతృత్వంలోని బృందం సచివాలయంలో సీఎంను కలిశారు. రాష్ట్రంలో గోద్రెజ్​ అగ్రోవెట్​ వ్యాపారాల గురించి వివరించారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్​ బాబు, సీఎస్​ శాంతికుమారి పాల్గొన్నారు. వంటనూనెలు, డెయిరీ, వెటర్నరీ, ఆగ్రో కెమికల్స్​ నిర్వహిస్తున్న గోద్రెజ్​ను కార్పొరేట్​ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్​ డెవలప్​మెంట్​ శిక్షణ ఇవ్వాలని సీఎం రేవంత్​ రెడ్డి సూచించారు.

టార్గెట్​ 2024- 500 స్థానాల్లో కాంగ్రెస్ సర్వే! సీట్ల పంపకం చర్చలకు ముందే!

'2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యం- ఐక్యతే మార్గం'- కాంగ్రెస్​ శ్రేణులకు ఖర్గే దిశానిర్దేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.