ETV Bharat / state

సచివాలయంలో రేపు సీఎం, మంత్రుల ప్రత్యేక సమావేశం - ప్రారంభించనున్న 'ప్రజాపాలన వెబ్‌సైట్‌' - prajapalana website

CM Revanth Reddy Review Meeting on Praja Palana Applications : సోమవారం సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో ప్రజాపాలన తదుపరి కార్యాచరణ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ సీట్ల భర్తీ, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. దీంతో పాటు ప్రజాపాలన వెబ్‌సైట్‌ను సీఎం రేవంత్​ రెడ్డి ప్రారంభించనున్నారు.

Ministers Meeting in Telangana 2024
CM Revanth Reddy Review Meeting on Praja Palana
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 7:15 PM IST

Updated : Jan 7, 2024, 8:55 PM IST

CM Revanth Reddy Review Meeting on Praja Palana Applications : సోమవారం రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి సమక్షంలో మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం జరగనుంది. ఊహించని స్థాయిలో ప్రజాపాలన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. అలానే దరఖాస్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. దీంతో నిజమైన అర్హులను ఎలా గుర్తిస్తారు? తరవాత చేసే కంప్యూటరీకరణ ప్రక్రియ ఎలా ఉంటుంది? తదుపరి అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీల అమలుపై సోమవారం సచివాలయంలో సీఎం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ప్రజాపాలన వెబ్‌సైట్‌ www.prajapalana.telangana.gov.in ను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు.

Telangana Ministers Meeting in Congress Government : సోమవారం ఉదయం 11 గంటలకు మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష జరపనున్నారు. ఎనిమిది రోజుల పాటు జరిగిన ప్రజాపాలన తదుపరి కార్యాచరణపై సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులు స్వీకరించగా(Total Praja Palana Applications in Telangana), వాటిలో ఐదు పథకాల కోసం 1,05,91,636 దరఖాస్తులు వచ్చాయి.

మాది ప్రజాస్వామ్య పాలన - తిరుగుబాటు ఉండదు : డిప్యూటీ సీఎం భట్టి

Ministera and Officials Meeting in Telangana 2024 : ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్ కార్డులు, ఇతర అంశాలపై 19,92,747 దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఫించన్లు రూ.4 వేలకు పెంపు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకు సిలిండర్ పథకాలను త్వరలో ప్రారంభించే అంశంపై సమీక్షలో చర్చించే అవకాశం ఉంది. రైతుబంధు నిధుల విడుదల, ఆదాయం, అప్పుల సమీకరణ, కొత్త రేషన్ కార్డులు, టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళన, కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది.

నెల రోజుల్లోనే ప్రజా పాలన అంటే ఏంటో చూపించాం : ఉత్తమ్​కుమార్​ రెడ్డి

CM Revanth Reddy Review Meeting : రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో(Telangana MLC Elections 2024) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో ఎవరిని నియమించాలనే చర్చ ఈ మీటింగ్‌లో జరగనుంది. నెల రోజుల పాలనపై మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా గ్యారంటీల అమలుపై చర్చ జరుగుతుందని సమాచారం. ఇప్పటికే రెండు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేస్తోంది. మరోవైపు వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

Parliament Elections 2024 : పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు దృష్టి పెట్టారు. అత్యధిక సీట్లు గెలిచే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే పీసీసీ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ ఎన్నికల్లో మరింత ముందుకు సాగేందుకు ఈ ప్రత్యేక సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

'ప్రజల కలలు నిజం చేయడమే ఇందిరమ్మ ప్రజాపాలన లక్ష్యం - అప్పుల రాష్ట్రాన్ని గట్టెక్కిస్తాం'

నెల రోజుల ప్రస్థానంపై రేవంత్ ట్వీట్ - 'మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా నా బాధ్యత నిర్వర్తిస్తా'

Last Updated : Jan 7, 2024, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.