CM Revanth Reddy Review Meeting on Irrigation Department : సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గురువారం రోజున తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు.
Revanth Reddy Review Meeting on Agriculture and Irrigation : ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు తెలియజేసేలా చూడాలని సీఎం తెలిపారు. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల లెక్కలు తేలాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు వివరాలను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని ఒకవేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో ప్రతి అంశాన్ని ప్రజలకు విడమరిచి చెబుతున్నామని అన్నారు.
CM Revanth Reddy Review Meeting Today : ఈ విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి నిజాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, రఘునందన్ రావు, శేషాద్రి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy on Medigadda Barrage Damage Issue : మరోవైపు ఆదివారం కూడా నీటిపారుదల సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యాసంగి పంటకు నీటి విడుదల, కుంగిన మేడిగడ్డ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని నీటి పారుదల శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇంజినీర్లతో సమావేశం నిర్వహించారు. నీటి పారుదల రంగం ప్రస్తుత పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలన్నారు. ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, ముందు ముందు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అంతరాష్ట్ర జల వివాదాలను త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
యాసంగి పంటకు నీటి విడుదల, మేడిగడ్డ అంశాలపై పూర్తి వివరాలు ఇవ్వండి : సీఎం రేవంత్ రెడ్డి
ఔటర్‌కు బయట, రీజినల్ రింగ్‌రోడ్‌కు లోపల భూములు సేకరించండి : రేవంత్‌రెడ్డి