ETV Bharat / state

ఫాక్స్​కాన్ ప్రతినిధులతో సీఎం భేటీ - 'స్నేహ పూర్వకంగా ఉండే విధానం అవలంభిస్తాం'

CM Revanth Reddy Meets With Foxconn Representatives : రాష్ట్రంలో ఫాక్స్​కాన్ కంపెనీ నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆ కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మేరకు సచివాలయంలో ఫాక్స్​కాన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Meets With Foxconn Representatives
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 2:59 PM IST

Updated : Dec 26, 2023, 3:51 PM IST

CM Revanth Reddy Meets With Foxconn Representatives : రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్​లో ఉన్న ఫాక్స్​కాన్ కంపెనీ నిర్వహణకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలిపారు. ఆ కంపెనీ భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టులకు కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. యాపిల్ ఫోన్, అనుబంధ పరికరాలు తయారు చేసే తైవాన్​కు చెందిన ఫాక్స్​కాన్ సంస్థకు కొంగర కలాన్​లో గత ప్రభుత్వం సుమారు 120 ఎకరాలు కేటాయించింది. లక్ష ఉద్యోగాలు కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఫాక్స్​కాన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.

ఫాక్స్ కాన్ ను బెంగళూరు తరలించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ ఎన్నికల సమయంలో ప్రచారం జరిగింది. కానీ నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఫాక్స్​కాన్(Foxconn)​కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి బృందం కలిసింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంభిస్తున్నామని సీఎం తెలిపారు.

CM Revanth Reddy Meets Foxconn Delegations : పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సులభంగా అందించడంతో పాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల ఆకాంక్షలను కాపాడే బాధ్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఆ రాష్ట్రం నుంచి 'ఫాక్స్​కాన్' ఔట్! ఏ ప్రభావం ఉండదన్న మంత్రి.. కాంగ్రెస్ ఫైర్!

Foxconn Industry At Kongarkalan In Telangana : గత ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రసిద్ధి చెందిన ఫాక్స్​కాన్ సంస్థ తెలంగాణలో 550 మిలియన్ డాలర్లుతో పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చిలో రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్​లో నాటి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ భూమి పూజ చేశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

మరో పదేళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఫాక్స్​కాన్ తెలిపింది. అయితే తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్​ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే గత ప్రభుత్వ విధానాలను పక్కన పెట్టకుండా ఫాక్స్​కాన్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి స్నేహ పూర్వక విధానాలను అవలంభిద్దామని చెప్పారు.

చైనాకు ఫాక్స్​కాన్​ షాక్​.. భారత్​లోనే ఐఫోన్ల తయారీ! అదే కారణమట!!

Foxconn Industry in Telangana : 'ఫాక్స్​కాన్​తో 35 వేల మందికి ఉపాధి'

Last Updated : Dec 26, 2023, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.