CM Revanth Reddy Meeting With Collectors and SPs Today : ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కలెక్టర్లు, ఎస్పీలతో రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సమావేశమయయ్యారు. ప్రజల వద్దకు పాలనను తీసుకెళ్లడమే ప్రధాన అజెండాగా భేటీ జరగుతోంది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో లోపాలపై చర్చించడంతోపాటు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సమాలోచనలు జరపుతున్నట్లు తెలుస్తోంది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు, పాలనా యాంత్రాంగాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లే ప్రజాపాలన కార్యక్రమంపై సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం.
Praja Palana Program in Telangana : హైదరాబాద్‌లోని మహాత్మజ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో ప్రతి మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణి కార్యక్రమం (Prajavani Program) నిర్వహిస్తున్నారు. దీనిని జిల్లా, డివిజన్, మండల, గ్రామస్థాయిల్లో మరింత పకడ్బందీగా ప్రజావాణి నిర్వహించేందుకు చేపట్టాల్సిన ప్రణాళికను, కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటిస్తున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆర్థిక సాధికారిత కల్పించడంతో పాటు, సామాజిక న్యాయం కల్పించేందుకు ఇచ్చిన ఆరు హామీల అమలుపై కలెక్టర్లకు, ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతోపాటు (Deputy CM Mallu Bhatti Vikramarka) మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు.
కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీపి కబురు చెప్తారు : పొంగులేటి
ప్రజాపాలన గ్రామ సభలు : నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కేట్లు, పాలనా యంత్రాంగాన్ని గ్రామస్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందుకే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లను కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. డిసెంబర్ 28 నుంచి వచ్చే ఏడాది జనవరి 6 తేదీ వరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రామ సభలు చేపడతారు.
ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నంబర్ : అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో, రోజుకు రెండు లెక్కన అధికారులతో కూడిన బృందాలు పర్యటిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రజాపాలన కార్యక్రమానికి స్థానిక సర్పంచ్, కార్పొరేటర్, కౌన్సిలర్‌లను ఆహ్వానించడంతోపాటు, సంబంధిత ప్రజా ప్రతినిధులందరూ విధిగా పాల్గొనేలా చర్యలు తీసుకుంటారు. గ్రామ సభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రత్యేకంగా పరిశీలించేందుకు ఒక్కోదానికి ఒక్కొక్క ప్రత్యేకమైన నంబర్ ఇస్తారు. దరఖాస్తులను కంప్యూటరైజ్ చేస్తారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం - ఎన్నికలకు ముందు మంజూరై ఉన్న, ప్రారంభం కానీ పనుల నిలిపివేత
మరోవైపు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల(Ration Card Process) జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కొత్త రేషన్ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నందున ఈ నెల 28 నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర సర్కార్ సన్నద్ధం అవుతోంది. మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసింది.
ప్రజావాణికి పొటెత్తిన జనం- డబుల్ బెడ్‌రూం, భూ సమస్యలే అధికం
పార్లమెంట్ ఎన్నికల్లో విజయకేతనమే లక్ష్యం - రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల 'హస్త'గతం దిశగా కసరత్తులు