ETV Bharat / state

స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక సాయం - రూ.2 లక్షల చెక్కు అందజేత

CM Revanth Reddy Help Swiggy Boy Family : స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబానికి సీఎం రేవంత్​ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. సచివాయంలో అందుకు సంబంధించిన చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. మరోవైపు మాజీ డీఎస్పీ నళిని సీఎం రేవంత్​ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Help Swiggy Boy Family
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 30, 2023, 5:28 PM IST

CM Revanth Reddy Help Swiggy Boy Family : సీఎం రేవంత్​ రెడ్డి మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. గతంలో కేసీఆర్​ను పరామర్శించడానికి యశోద ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఒక మహిళ అన్నా అని పిలిస్తే వెంటనే ఆమె వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే అధికారులకు ఆదేశాలు ఇస్తూ తన తండ్రికి అయ్యే ఆసుపత్రి ఖర్చును చూసుకోవాలని సూచించారు.

అలాగే పోలీసు శాఖ సమీక్షలో తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని(Nalini)కి మళ్లీ ఉద్యోగ ఆఫర్​ ఇచ్చారు. వీటన్నింటి కంటే ముందు ప్రమాణ స్వీకారం రోజునే దివ్యాంగురాలికి ఉద్యోగం ఇచ్చే దస్త్రంపై సంతకం చేశారు. ఇలా ఎప్పటికప్పుడు తన మంచి మనసు చాటుకుంటూ మనసున్న నేత అని మరోసారి రుజువు చేసుకున్నారు. అయితే మళ్లీ ఇప్పుడు ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్​(Swiggy Delivery Boy) కుటుంబానికి రూ.2 లక్షలు ఆర్థిక సహాయం చేశారు.

స్విగ్గీ డెలివరీ బాయ్​ కుటుంబానికి సీఎం రూ.2 లక్షల ఆర్థిక సాయం : వివరాల్లోకి వెళితే ప్రమాదవశాత్తు మరణించిన స్విగ్గీ డెలివరీ బాయ్​ రిజ్వాన్​ కుటుంబానికి సీఎం రేవంత్​ రెడ్డి రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. హైదరాబాద్​లో నాలుగు నెలల క్రితం స్విగ్గీ ఆర్డర్​ ఇచ్చేందుకు ఒక అపార్టుమెంట్​లోకి వెళ్లి రిజ్వాన్ కుక్క నుంచి తప్పించుకోబోయి భవనంపై నుంచి పడి మరణించారు. ఈ విషయంపై ఇటీవల ఎగ్జిబిషన్​ గ్రౌండ్స్​లో గిగ్​ వర్కర్స్​తో జరిగిన సమావేశంలో ఈ స్విగ్గీ బాయ్ ప్రస్తావన వచ్చింది.

గత ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుందని ఎదురు చూశామని గిగ్​ వర్కర్స్​ తెలిపారు. ఆ కుటుంబ వివరాలు తెలుసుకొని రూ.2 లక్షల ఆర్థిక సాయం చేయాలని అదే రోజున అధికారులకు సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు ఇవాళ సచివాయంలో రిజ్వాన్​ కుటుంబ సభ్యులకు సీఎం సహాయ నిధి కింద రూ.2 లక్షల చెక్కును అందించారు.

కుక్కకు భయపడి భవనంపై నుంచి దూకిన డెలివరీ బాయ్ మృతి

Former DSP Nalini meet CM Revanth Reddy : మరోవైపు తెలంగాణ ఉద్యమ సమయంలో డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళిని ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర సాధన కోసం ఉద్యోగాన్ని త్యాగం చేసిన నళినికి తిరిగి ఉద్యోగం ఇవ్వడానికి అడ్డంకులేంటని ఇటీవల పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం పేర్కొన్నారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని అధికారులకు చెప్పారు. అయితే ఉద్యోగం చేసేందుకు తిరస్కరించిన నళిని సీఎం రేవంత్​ రెడ్డిని కలిశారు. . పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, వైద్యలింగం, తదితరులు కూడా సచివాలయంలో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

Former DSP Nalini meet CM Revanth Reddy
సీఎం రేవంత్​ రెడ్డిని కలిసిన నళిని

ఫోర్త్ ఫ్లోర్ నుంచి లిఫ్ట్‌లో పడిపోయి డెలివరీ బాయ్ మృతి

సమీక్షలు, సమావేశాలు, ఆదేశాలు - పాలనపై తనదైన ముద్ర వేస్తున్న సీఎం రేవంత్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.