CM Revanth Reddy Gave Two Crores Check to Nikhat Zareen : వరల్డ్ ఛాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు (Nikhat Zareen)ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.2 కోట్ల చెక్ అందించారు. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో నిఖత్‌కు ఈ చెక్ అందజేశారు. పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ సన్నద్ధత కోసం సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తాన్ని అందజేశారు. నిఖత్ భవిష్యత్‌లో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాక్షించారు.
ఇటీవల నిర్వహించిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ 50 కిలోల విభాగంలో నిఖత్ జరీన్ పసిడిని కైవసం చేసుకున్నారు. వరుసగా రెండో ఏడాది ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి అదరగొట్టారు. దిగ్గజ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన రెండో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించారు.
'నిజామాబాద్ పేరును ప్రపంచానికి చాటిచెప్పినందుకు చాలా గర్వంగా ఉంది'
"ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన రూ.2 కోట్లు పారిస్ ఒలింపిక్స్ ప్రిపరేషన్‌కు మంచిగా ఉపయోగపడతాయి. ఈ డబ్బులను నా ప్రిపరేషన్ కోసం ఉపయోగిస్తాను. ఇంకా కష్టపడతాను. మన తెలంగాణకు మంచి పేరు తీసుకువస్తాను." - నిఖత్ జరీన్, బాక్సర్
Boxer Nikhat Zareen : సాధారణ మధ్య తరగతి కుటుంబం, ఎన్నో ఆటుపోట్లు, ఆడపిల్లకు ఇలాంటి ఆటలేంటి అంటూ అవమానాలు వాటన్నింటిని దాటి ప్రపంచానికి తన సత్తా చాటింది తెలుగమ్మాయి నిఖత్ జరీన్. చిన్నతనం నుంచే బాక్సింగ్‌పై మక్కువ పెంచుకుంది. భారత బాక్సింగ్ కేరాఫ్ నిఖత్ అన్నట్లుగా మారింది. తాజాగా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది.
'ఏదైనా సాధించాలనుకుంటే జీవితంలో కొన్ని త్యాగాలు చేయాల్సిందే'