ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు ​- త్వరలోనే కొత్త బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వ సన్నాహాలు ముమ్మరం - cm revanth reddy

CM Revanth Reddy Focus On TSPSC New Board : టీఎస్​పీఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు పడనున్నాయి. ఛైర్మన్‌తో పాటు ముగ్గురు సభ్యుల రాజీనామాల్ని గవర్నర్‌ ఆమోదించడంతో కొత్త బోర్డు ఏర్పాటు కానుంది. ఛైర్మన్‌తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా ఛైర్మన్‌తో పాటు సభ్యుల్ని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం.

Telangana Govt Plan to Setup TSPSC New Board
CM Revanth Reddy Focus On TSPSC New Board
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 11, 2024, 7:09 AM IST

టీఎస్​పీఎస్సీ ప్రక్షాళనకు లైన్​క్లియర్​- కొత్తబోర్డు ఏర్పాటుకు ప్రభుత్వ సన్నాహాలు

CM Revanth Reddy Focus On TSPSC New Board : ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంతో టీఎస్​పీఎస్సీ(TSPSC) తీవ్ర విమర్శల పాలైంది. కొత్త బోర్డు ఏర్పాటు చేసిన తరువాతే పరీక్షలు నిర్వహించాలని అప్పట్లో నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కొత్త సర్కారు కొలువుదీరడంతో కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఛైర్మన్‌తో పాటు పూర్తిస్థాయిలో సభ్యులను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది.

టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్​ తమిళి సై

కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తోంది. వీలైనంత త్వరగా ఛైర్మన్‌తో పాటు సభ్యుల్ని నియమించే అవకాశాలున్నట్లు సమాచారం. విమర్శలకు తావు లేకుండా నిబంధనల మేరకు ఛైర్మన్, సభ్యులను నియమించనున్నట్లు తెలిసింది. టీఎస్​పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఇతర రాష్ట్రాల పీఎస్సీల్లో అమలు చేస్తున్న మెరుగైన విధానాల్ని అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Telangana Govt Plan to Setup TSPSC New Board : ఇప్పటికే కేరళ పీఎస్సీని ఈ బృందం అధ్యయనం చేసింది. ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్ర అధికారులతో కలిసి యూపీఎస్సీ(UPSC) ఛైర్మన్‌ను కలిసి పోటీ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా చేపట్టేందుకు సూచనలు కోరారు. అధ్యయన నివేదిక వచ్చిన అనంతరం కమిషన్‌లో పలు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. టీఎస్​పీఎస్సీకి నూతన బోర్డు ఏర్పాటైన తరువాత ఉద్యోగాల నియామక ప్రక్రియలో కదలిక రానుంది.

యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీని తీర్చిదిద్దేందుకు సహకరించండి - మనోజ్​ సోనితో సీఎం రేవంత్​ రెడ్డి

గ్రూప్‌-2 పరీక్షలకు కొత్త తేదీల ఖరారుతో పాటు ఇప్పటివరకు పరీక్షల తేదీలు ప్రకటించని నోటిఫికేషన్లకు షెడ్యూలు ప్రకటించాలన్నా, పూర్తయిన పరీక్షల ఫలితాలు వెల్లడించాలంటే బోర్డు ఉండాలి. కమిషన్‌ నిబంధనల ప్రకారం ఏదైనా పరీక్ష నిర్వహణ తేదీ ఖరారు చేయాలన్నా, ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్నా, పరీక్ష వాయిదా వేయాలన్నా, ఫలితాలు వెల్లడించాలన్నా బోర్డుదే నిర్ణయాత్మక అధికారం.

ప్రభుత్వ విభాగాల నుంచి వచ్చిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలు, సర్వీసు నిబంధనలు, పొరపాట్లు ఇలాంటివన్నీ పరిశీలిస్తుంది. బోర్డు తీసుకున్న నిర్ణయాలను కార్యదర్శి అమలు చేస్తారు. కార్యదర్శి ఆదేశాల మేరకు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తారు. టీఎస్​పీఎస్సీ నిబంధనల ప్రకారం బోర్డులో ఛైర్మన్‌తో పాటు 11 మంది సభ్యులు ఉండాలి.

ప్రస్తుతం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఛైర్మన్‌ పదవి ఖాళీ అయింది. ఇద్దరు సభ్యులను పరిగణనలోకి తీసుకుంటే ఛైర్మన్‌తో పాటు తొమ్మిది మంది సభ్యుల్ని ప్రభుత్వం నియమించాల్సి ఉంది. మరోవైపు, కీలకమైన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ పోస్టు ఖాళీగా ఉంది. యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల పీఎస్సీల్లో అమలు చేస్తున్న నియమావళి ప్రకారం కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ హోదాలో నియమితులయ్యే ఐఏఎస్ అధికారి స్థానిక రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు.

అంటే తెలంగాణ వాస్తవ్యులు కాకూడదు. ఇతర రాష్ట్రాలకు చెందిన తెలంగాణ క్యాడర్‌ అధికారులు అయి ఉండాలి. గతంలో ఈ పోస్టులో నియమితులైన ఐఏఎస్ అధికారి సంతోష్‌ ఇటీవలే బదిలీపై జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా వెళ్లారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.

Revanthreddy on TSPSC Board : టీఎస్​పీఎస్సీ బోర్డు.. రాజకీయ పునరావాస కేంద్రంగా మారింది : రేవంత్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.