CM Revanth Reddy Focus on Officials Transfers : త్వరలో రాష్ట్రంలో భారీ ఎత్తున ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా అధికారుల వివరాలు, సర్వీస్ రికార్డులు, ఇంటెలిజెన్స్ రిపోర్టులను(Intelligence Report) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారు. భారీ ఎత్తున జరగనున్న ఈ బదిలీలపై రేవంత్ రెడ్డి(Revanth Reddy) కసరత్తు చేస్తున్నారు.
ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష - నిషేధిత జాబితాతో పాటు పలు అంశాలపై నివేదికకు ఆదేశం
ఇప్పటి వరకు కేవలం కొద్ది మంది అధికారులకు మాత్రమే పోస్టింగులు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ మిగతా వాటి విషయమై విస్తృత కసరత్తు చేస్తున్నారు. తన కార్యాలయంలోనూ మరో ఇద్దరు లేదా ముగ్గురు కార్యదర్శులను నియమించుకోవడంతో పాటు కార్యదర్శులు(Secretaries), హెచ్ఓడీల పోస్టింగులు చేపట్టాల్సి ఉంది. కొన్ని పోస్టులు ఇప్పటికే ఖాళీగా ఉండగా, మరికొన్ని పోస్టింగుల్లో మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ దిశగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నారు.
CM Revanth Reddy Review Meeting For Officials Postings : ఇవాళ ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అధికారుల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన అంశాలపైనే చర్చించినట్లు సమాచారం. త్వరలోనే కొన్ని పోస్టింగులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడతాయని అంటున్నారు.
-
Some pics remind us how far we have come..
— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will!
Thanks to all your love ♥️,
ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv
">Some pics remind us how far we have come..
— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023
through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will!
Thanks to all your love ♥️,
ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYvSome pics remind us how far we have come..
— Smita Sabharwal (@SmitaSabharwal) December 13, 2023
through the valleys and the summits. 23 years to this pic… a driven young lady who always walked her will!
Thanks to all your love ♥️,
ever ready for a new challenge. pic.twitter.com/xahFAszBYv
మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్(Smita Sabharwal) ఎక్స్(ట్విట్టర్)లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై 23 ఏళ్లు అయిన సందర్భంగా ఎక్స్‌లో పోస్ట్ చేసిన స్మితా సబర్వాల్, కొత్త సవాళ్లకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు.
Congress Party Governance in Telangana : ప్రతిరోజు కీలక అంశాలపై రివ్యూలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ మెట్రో రైలు వ్యవస్థపైనా సమీక్ష జరిపారు. సమావేశంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి సహా పురపాలక శాఖ, మెట్రో అధికారులు పాల్గొన్నారు. మెట్రో రైల్(Metro Train) తాజా పరిస్థితులు, రోజువారి ఆదాయం, కల్పిస్తున్న సౌకర్యాలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్ ప్రణాళికలు, విస్తరణపై సీఎం రేవంత్ అధికారుల్ని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నిక ఏకగ్రీవం
పార్లమెంటు మాదిరి అసెంబ్లీ భవనాలు - నిర్మించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం