CM Revanth New Year Wishes 2024 : నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలు అందరు సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల అందరికి కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరి సహకారంతో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని గుర్తు చేశారు.
-
Wishing you all a Happy 2024
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
May this #NewYear bring happiness, success & good health.
அனைவருக்கும் இனிய ஆங்கில புத்தாண்டு-2024 நல்வாழ்த்துக்கள்...#HappyNewYear2024#HappyNewYear2024wishes pic.twitter.com/Ge5H7JfP1z
">Wishing you all a Happy 2024
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 31, 2023
May this #NewYear bring happiness, success & good health.
அனைவருக்கும் இனிய ஆங்கில புத்தாண்டு-2024 நல்வாழ்த்துக்கள்...#HappyNewYear2024#HappyNewYear2024wishes pic.twitter.com/Ge5H7JfP1zWishing you all a Happy 2024
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 31, 2023
May this #NewYear bring happiness, success & good health.
அனைவருக்கும் இனிய ஆங்கில புத்தாண்டு-2024 நல்வாழ்த்துக்கள்...#HappyNewYear2024#HappyNewYear2024wishes pic.twitter.com/Ge5H7JfP1z
నిర్బంధాలు, ఇనుప కంచెలు తొలగిపోయాయని, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. 2024ను 'రైతు-మహిళ-యువత నామ సంవత్సరంగా సంకల్పం తీసుకున్నామని తెలిపారు. తెలంగాణలో ప్రతి గడపలో సౌభాగ్యం వెల్లివిరియాలని కోరుకుంటున్నాని సీఎం రేవంత్ వెల్లడించారు.
కళ్లు చెదిరే సెలబ్రేషన్స్‌తో 2024కు స్వాగతం- ఈ ఫొటోలు చూస్తే ఔరా అనాల్సిందే!
Bhatti New Year Wishes 2024 : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పారు. 2024లో ప్రతి ఇంటా ఆనందాలు, ప్రతి కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని భట్టి ఆకాంక్షించారు. అన్ని సామాజిక వర్గాలు సుస్థిరమైన అభివృద్ధి పథంలో ప్రయాణించేలా కాంగ్రెస్ ఇందిరమ్మ పాలన ఉంటుంది హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త ఏడాది కొంగొత్త నిర్ణయాలు - నూతన లక్ష్యాలతో ముందుకు వెళ్తామంటున్న యువత
తెలంగాణ ప్రజలకు మంత్రి జూపల్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖఃసంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని, సంపద, సమృద్ధి కలగాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
DGP Ravi Gupta New Year Wishes 2024 : రాష్ట్ర ప్రజలకు డీజీపీ రవిగుప్త నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2024 నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు నింపాలని ఆయన ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజల శాంతి, భద్రత, సంక్షేమం కోసం నిబద్ధతతో కృషి చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని స్పష్టం చేశారు. నూతన సంవత్సరంలోనూ ఈ నిబద్ధత మరింత పెంచి, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించడానికి పోలీస్ శాఖ కృషి చేస్తుందని వెల్లడించారు.
న్యూ ఇయర్ స్పెషల్ గ్రీటింగ్స్ - ఇలా శుభాకాంక్షలు చెప్తే గుండెను తాకాల్సిందే!
న్యూ ఇయర్ వాట్సాప్ స్టేటస్ - ఈ కోట్స్ ట్రై చేశారంటే సూపర్ అనాల్సిందే!