ETV Bharat / state

CM KCR Wishes Adivasis : ఆదివాసీలకు అండగా ప్రభుత్వం: కేసీఆర్‌ - CM KCR Wishes Adivasis

CM KCR Wishes Adivasis : మమతానురాగాలకు, కల్మషం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభ్యున్నతి, సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఆగస్టు 9) సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజనులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

CM KCR WISHES
CM KCR WISHES
author img

By

Published : Aug 9, 2022, 8:57 AM IST

CM KCR Wishes Adivasis : నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆదివాసీలు, గిరిజనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలు, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని సీఎం పేర్కొన్నారు. స్వయం పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మా తండాలో మా రాజ్యం అనే ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చిందన్నారు.

World Adivasis day : ఈ సందర్భంగా గిరిజనులకు గురుకులాల ద్వారా అత్యున్నతస్థాయి విద్యను, అంబేడ్కర్​ విదేశీ విద్యానిధి ద్వారా విదేశీ విద్యను, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడడానికి ఆదివాసీ, గిరిజన యువతకు ఉచిత శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. గిరిజన గూడాలకు, తండాలకూ విద్యుత్​, రోడ్లు వంటి మౌలిక వసతులను మరింతగా మెరుగుపరుస్తున్నామన్నారు. కుమురం భీం స్మారక మ్యూజియంతో పాటు పలు మ్యూజియాలు ఇప్పటికే ప్రారంభం కాగా.. రాంజీ గోండు స్మారక మ్యూజియాన్ని త్వరలో నిర్మించనున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్​లోని విలువైన ప్రాంతంలో ఆదివాసీ, గిరిజన ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నామని సీఎం చెప్పారు. ఆదివాసీ సంస్కృతీ, సాంప్రదాయాలు, పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని.. గిరిజన సహకార సంస్థ ద్వారా ఉపాధిని అందిస్తూ, గిరి బ్రాండ్ పేరుతో అటవీ ఉత్పత్తులను విక్రయిస్తూ వారి వ్యాపారాభివృద్ధికీ ప్రభుత్వం దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్​..

మొహర్రం త్యాగానికి ప్రతీక.. మొహర్రం మానవతావాదాన్ని ప్రతిబింబిస్తుందని, త్యాగం, శాంతి, న్యాయ ఆదర్శాలు అందరికీ స్ఫూర్తిదాయకమని గవర్నర్‌ తమిళిసై తన సందేశంలో తెలిపారు. త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.

పీవీ సింధుకు అభినందనలు.. కామన్వెల్త్‌ క్రీడల్లో బాడ్మింటన్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన పీవీ సింధును ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. పలువురు మంత్రులు సైతం సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. టేబుల్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌లో స్వర్ణం సాధించిన ఆచంట శరత్‌ కమల్‌, శ్రీజ ఆకులకు కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌లు అభినందనలు తెలియజేశారు. పురుషుల బ్యాడ్మింటన్‌ సింగిల్స్‌లో బంగారు పతకం సాధించిన లక్ష్యసేన్‌ను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ప్రత్యేకంగా అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.