ETV Bharat / state

రేపు ప్రగతిభవన్‌లో తెరాస నేతలతో సీఎం కేసీఆర్ కీలక భేటీ - Latest news of KCR remembered by Gandhiji

రేపు ప్రగతిభవన్‌లో తెరాస నేతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ కానున్నారు. మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను సీఎం ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై తెరాస నాయకులతో కేసీఆర్​ చర్చించనున్నారు.

CM KCR
CM KCR
author img

By

Published : Oct 1, 2022, 10:25 PM IST

రేపు ప్రగతిభవన్‌లో తెరాస నేతలతో సీఎం కేసీఆర్ కీలక భేటీ నిర్వహించనున్నారు. మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై తెరాస నాయకులతో కేసీఆర్ చర్చించనున్నారు.

మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శనీయం: ప్రజాస్వామిక పంథా ద్వారా, దేశ ప్రజలను స్వాతంత్ర్యోద్యమంలో లక్ష్యసాధన దిశగా కార్యోన్ముఖుల్ని చేసిన జాతిపిత మహాత్మా గాంధీ జీవితం అందరికీ, అన్ని కాలాలకూ ఆదర్శనీయమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్ గాంధీజీ జాతికి అందించిన స్ఫూర్తిని స్మరించుకున్నారు.

స్వాతంత్ర్య సంగ్రామంలో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా అహింసా, సత్యాగ్రహమనే సిద్ధాంతాలను ఆచరించి.. విజయం సాధించి చూపడం ద్వారా ప్రపంచానికి సరికొత్త పోరుబాటను మహాత్మా గాంధీ పరిచయం చేశారని కేసీఆర్ అన్నారు. గాంధీ ఆచరించిన బాటలో పయనించిన ఎన్నో దేశాలు బానిసత్వం నుండి విముక్తి పొందాయని తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహా పురుషుడు మహాత్మా గాంధీ అని కొనియాడారు.

గాంధీజీ స్ఫూర్తితో శాంతియుత మార్గంలో ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. సత్యమేవ జయతే అని చాటి చెప్పిన మహాత్మా గాంధీ జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. గుంపులో ఒకరిగా ఉండటం తేలికే కానీ.. ఒంటరిగా నిలబడడానికి ధైర్యం కావాలన్న గాంధీ మాటలే ప్రేరణగా.. హక్కుల సాధనకోసం తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు.

ఇవీ చదవండి: 'విద్వేష రాజకీయాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి'

ఆరోసారి బెస్ట్​ క్లీన్​ సిటీగా ఇందోర్.. టాప్​-3 నుంచి విజయవాడ మిస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.