తెలంగాణలో అమలు చేయనున్న నియంత్రిత పంటల సాగు విధానాన్ని... ఖరారు చేసేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన గురువారం విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం రెండింటి నుంచి ప్రగతిభవన్‌లో జరగనున్న సమావేశంలో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు పాల్గొంటారు.
తెలంగాణలో ఏ పంట.. ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలన్న విషయాన్ని మంత్రివర్గ సమావేశంలో చర్చించి ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. జిల్లాల వారీగా ఏ పంట ఎంత వేయాలి.. వరిలో ఏ రకం విత్తనం ఎక్కడ ఎంత వేయాలనే అంశాలపై గత రెండు రోజులుగా వ్యవసాయ శాఖ చర్చించి జిల్లాల వారీ పంటల మ్యాప్ రూపొందించినట్లు సమాచారం. ఈ మ్యాప్‌పై గురువారం జరిగే సమావేశంలో చర్చించనున్న కేసీఆర్... జిల్లాల వారీ సాగు చేయాల్సిన పంటలను ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: కేంద్రం ప్యాకేజీ డొల్ల... ముఖ్యమంత్రి గుస్సా