ETV Bharat / state

నేటితో ముగియనున్న సహస్రాబ్ది వేడుకలు.. మహాపూర్ణాహుతికి సీఎం కేసీఆర్‌

author img

By

Published : Feb 14, 2022, 3:05 AM IST

Updated : Feb 14, 2022, 6:56 AM IST

Sri Ramanuja sahasrabdi celebrations: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సహస్రాబ్ది ఉత్సవాలు... నేటితో ముగియనున్నాయి. ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ ఉదయం 9:30కి యాగశాలలో జరగనున్న సహస్ర కుండలాల యజ్ఞానికి మహాపూర్ణహుతి పలుకనున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

Ramanuja sahasrabdi utsav
Ramanuja sahasrabdi utsav

Sri Ramanuja sahasrabdi celebrations ending today: భగవత్ రామానుజాచార్యుల వెయ్యేళ్ల వైభవాన్ని పురస్కరించుకొని... రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సహస్రాబ్ది ఉత్సవాలు... నేటితో ముగియనున్నాయి. ఫిబ్రవరి 2న మొదలైన సమతామూర్తి వేడుకలు 11 రోజులుగా... ఎంతో కన్నుల పండువగా సాగాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు:

ఉత్సవాల్లో చివరి రోజైన ఇవాళ ఉదయం 9:30కి యాగశాలలో జరగనున్న సహస్ర కుండలాల యజ్ఞానికి మహాపూర్ణహుతి పలుకనున్నారు. ఆ కార్యక్రమానికి.. ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.

కల్యాణ మహోత్సవం:

అనంతరం ఉదయం 11:30కి సమతామూర్తి బంగారువిగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపనచేసి తొలిఆరాధన చేయనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు 108 ఆలయాల్లో అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల సమక్షంలో కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.

ఇదీ చూడండి: ముచ్చింతల్‌ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది: రాష్ట్రపతి

Last Updated : Feb 14, 2022, 6:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.