ETV Bharat / state

అడవుల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది: కేసీఆర్‌ - కలప స్మగ్లర్లకు కేసీఆర్​ హెచ్చరిక

"పోయిన అడవిని తిరిగి తెచ్చుకోవాలంటే మనం మేల్కోవాలి. మన ఇల్లు మనం శుభ్రం చేసుకోకుంటే పక్కింటి వారు వచ్చి చేస్తారా? అడవుల పునరుద్ధరణకు అమెరికావారో, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల వారో వచ్చి ఏమైనా సాయం చేస్తారా? ఈ పని ఫారెస్టు వాళ్లదని అనుకుంటే... మన బతుకు అడవి అవుతుంది. ఇది మన పని అని సోయి రావాలి." - కేసీఆర్‌, సీఎం

అడవుల్లో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతుంది: కేసీఆర్‌

author img

By

Published : Jun 26, 2020, 6:09 AM IST

అడవుల్లో చీమ చిటుక్కుమన్నా నిమిషాల మీద సమాచారం వచ్చే వ్యవస్థను పాదుగొల్పినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ఇకపై కలప చౌర్యానికి పాల్పడి అక్రమ రవాణా చేస్తే ప్రపంచంలో మిమ్మల్నెవరూ కాపాడలేరని స్మగ్లర్లను హెచ్చరించారు. ‘‘ఎల్లమ్మ కూడబెడితే మల్లమ్మ మాయం చేసినట్లు... ఇకపై కలప అక్రమ రవాణా చేస్తే క్షమించం. అటవీ స్మగ్లర్ల ఆట కట్టించడానికి ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ నివేదిక మేరకు ప్రత్యేక అధికారిని నియమించాం. రాష్ట్రంలో అడవులను పునరుద్ధరిస్తాం. ఇందుకు అవసరమైన డబ్బులు, మానవ వనరులు అన్నీ ఉన్నాయి.

రెండు వేల ఉద్యోగాలు భర్తీ చేసి అటవీశాఖను బలోపేతం చేశామని.. 2,200 కొత్త వాహనాలను ఇచ్చామని’’ అని సీఎం పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో గురువారం ఆరో విడత హరితహారానికి అంకురార్పణ చేశారు. ఈ సందర్భంగా పట్టణం శివారులోని అర్బన్‌ పార్క్‌ను ప్రారంభించి.. మొక్క నాటారు. అక్కడ వాచ్‌టవర్‌ నుంచి అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

"మీకు దండం పెడుతున్నా.. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, జడ్పీ అధ్యక్షులు, పురపాలిక ఛైర్‌పర్సన్లు, మేయర్లు కీలకంగా మారి హరితహారంలో కదం తొక్కాలి. ప్రజలే కాపలాదారులుగా మారి అక్రమ కలప రవాణాకు అడ్డుకట్ట వేయాలి. కలప అక్రమ రవాణాకు ఊతం ఇచ్చే అధికారులపై చర్యలు తప్పవు."

- కేసీఆర్‌, సీఎం

ఇంటికి ఆరు మొక్కలు

"అడవుల నరికివేతతో 55 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైతే... పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ పరిస్థితి రాకుండా హరిత ఉద్యమంలో భాగస్వాములమవుదాం. ప్రజలు కథానాయకులుగా మారాలి. కలెక్టర్లు నర్సింహావతారం ఎత్తి అడవులను రక్షించాలి. ఇంటికి ఆరు మొక్కలు ఇచ్చి కుటుంబసభ్యుల పేరిట నాటేలా చూస్తే బాధ్యత పెరుగుతుంది. ప్రతి దానికి అమెరికా, జర్మనీ, జపాన్‌ ఆదర్శం గురించి మాట్లాడుకోవడం కాదు... మనం కష్టపడితే వాటిని మించిపోవచ్చు".

- కేసీఆర్‌, సీఎం

స్వయంగా కారు నడుపుతూ తిరిగేవాడిని

"నేను స్వయంగా తిరిగిన రోడ్లు ఇవి. ఎమ్మెల్యే అయిన కొత్తలో 1985లో తూప్రాన్‌, నర్సాపూర్‌, సంగారెడ్డి, మెదక్‌, హైదరాబాద్‌ మార్గాల్లో నా ఫియట్‌ కారును స్వయంగా నడుపుకుంటూ ఈ ప్రాంతంలో తిరిగేవాడిని. నర్సాపూర్‌ అడవుల్లో నిత్యం ఏదో ఒక మూల సినిమా చిత్రీకరణ జరిగేది. అడవులంటేనే నర్సాపూర్‌ అని సినీ వర్గాల్లో ముద్ర ఉండేది. ఈ ప్రాంతంలోని కౌడిపల్లి చెరకు, బెల్లం గానుగలతో కళకళలాడేది. ఇక్కడ కరవు జాడ ఉండేది కాదు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎక్కడ వర్షం లేకున్నా నర్సాపూర్‌లో వర్షాలు పడేవి. దీనిని మనం పోగొట్టుకున్నాం... చెడగొట్టుకున్నాం. నర్సాపూర్‌ అడవిని మళ్లీ తిరిగి తెచ్చుకుందాం. ఈ ప్రాంతంలో 92 వేల ఎకరాల్లో అడవి పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మాదిరి అడవులను పునరుద్ధరిస్తాం."
- కేసీఆర్‌, సీఎం

పదివేల మొక్కలకు పదివేల అవతారాలెత్తా

"సిద్దిపేట ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో నియోజకవర్గంలో పదివేల మొక్కలు నాటాలని నిర్ణయించా. ఇందుకు పదివేల అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. హుడాలో అధికారిగా ఉన్న భూపాల్‌రెడ్డి నుంచి వెయ్యి మొక్కలు తీసుకొచ్చా. నాడు ముఖ్యమంత్రి, మంత్రి స్థాయిలోవారు మొక్క పెట్టి ఫొటోలకు ఫోజులిచ్చేవారు. జిల్లాలో అప్పట్లో ఒక నర్సరీ ఉండడమే ఎక్కువ. ప్రస్తుతం తెలంగాణలో చేపట్టిన హరితహారంతో ఊరూరా నర్సరీలు ఏర్పాటయ్యాయి."

- కేసీఆర్‌, సీఎం

ఉత్పత్తులను గ్రామాల్లోనే కొనే యోచన

రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ రైతు ఏ పంట సాగుచేస్తున్నారో తెలియదు. గొర్రె దాటుడు సాగుతో అన్నదాతలు నష్టపోతున్నారు. ఈ పద్ధతిని మార్చడానికే నియంత్రిత పంటల సాగు విధానాన్ని ప్రవేశపెట్టాం. వ్యవసాయ ఉత్పత్తులను గ్రామాల్లోనే కొనుగోలు చేపట్టేలా ప్రణాళిక రూపొందించాలని యోచిస్తున్నాం. దేశంలో ఇలాంటి వ్యవస్థ ఎక్కడా ఉండదేమో. ఇష్టారీతిన పంటలు సాగుచేస్తే పంజాబ్‌ మాదిరి సమస్యల వలయంలో చిక్కుకుంటాం. తెలంగాణ ఏర్పడ్డాక.. ఇక్కడి ప్రజలు ఏం తింటారు... అని అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదు. దిల్లీలోని ఓ సంస్థ ద్వారా 370 మందితో సర్వే చేయిస్తే తెలంగాణలో ఏటా ఆహారం రూపంలో కోటి టన్నుల ధాన్యం వినియోగిస్తున్నట్లు తేలింది. వరిని ఇబ్బడి ముబ్బడిగా పండిస్తే రాష్ట్రంలో నాలుగు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. రాష్ట్రంలో రైసుమిల్లుల నిల్వ సామర్థ్యం 1.5 నుంచి 2 కోట్ల టన్నులు మాత్రమే. ఇలాంటి సమస్యను అధిగమించడానికి నియంత్రిత సాగు చేపట్టాం.

- కేసీఆర్‌, సీఎం

రోహిణి కార్తెలోనే నార్లు వేయాలని..

రాష్ట్రంలో మొగులుకు ముఖం పెట్టి చూసే రోజులు పోవాలని... రోహిణి కార్తెలోనే నార్లు వేసే పరిస్థితి రావాలని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఖర్చు అవుతాయా అని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు ఎకానమిస్టులు కారు. ఇదివరకు నేను సూర్యాపేటకు వెళితే నీళ్ల గురించి అడిగారు. కాలువల ద్వారా ఆరునెలల పాటు నీటిని సరఫరా చేశాక... మళ్లీ అక్కడకు వెళితే నన్ను బంతిని ఎగుర వేసినట్టు ఎగురవేసి సంబురపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,500 కోట్లతో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టాం. వాటివల్ల భూగర్భజల మట్టం పెరుగుతుంది. తెలంగాణలో మిషన్‌ భగీరథ పథకం కింద నిత్యం నీరందుతోంది. కరెంట్‌ కష్టాలు పోయాయి. గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్‌ యార్డుల నిర్మాణం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు తెలంగాణ వాళ్లు వ్యవసాయానికి కూడా పనికిరారని విమర్శించారు. నేడు మన తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో అద్భుతాలు సాధిస్తున్నారు. దేశంలో ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో 55 శాతం తెలంగాణ నుంచి వచ్చిందని, ఆ సంస్థ ఛైర్మన్‌ ప్రసాద్‌ ప్రకటించడం రాష్ట్రం సాధించిన విజయానికి నిదర్శనం. ఇది డంకీలు కొడితే వస్తుందా? సంఘటిత శక్తితో దీన్ని సాధించాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు.

కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి, నర్సాపూర్‌, మెదక్‌, అందోల్‌ ఎమ్మెల్యేలు మదన్‌రెడ్డి, పద్మా దేవేందర్‌రెడ్డి, క్రాంతికిరణ్‌, మాజీ మంత్రి సునీతారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి నర్సింగరావు, నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్‌కుమార్‌, పీసీసీఎఫ్‌ శోభ, మెదక్‌ కలెక్టర్‌ ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మనది ధనిక రాష్ట్రమే

"తెలంగాణ ధనిక రాష్ట్రమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. ‘నేనే అధికారికంగా చెబుతున్నా. డబ్బు సమస్య లేనేలేదు. కరోనా గడబిడ వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలు సగం జీతాలు ఇచ్చాం. మళ్లీ పుంజుకున్నాం. తెలంగాణ ధనిక రాష్ట్రం కాదని ఎవరన్నా మాట్లాడితే పట్టించుకోవద్దు. ప్రజా ప్రతినిధులు, ప్రజలు సంఘటితంగా కదిలితే అడవుల పునరుద్ధరణ సాధ్యమే. స్వాతంత్య్రం వచ్చిన తరువాత తెలంగాణ అడవులను మాయం చేసిన వారే ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారు. వారికి సిగ్గు, పౌరుషం ఏమీ లేదు. కలప చౌర్యానికి అడ్డుకట్ట వేసి, రాష్ట్రంలో అడవులను పునురుద్ధరించడమే ధ్యేయంగా ప్రస్తుతం పని చేస్తున్నాం. తెలంగాణలో ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేశాం. దేశంలో ఈ వ్యవస్థ ఉన్న ఏకైక రాష్ట్రంతెలంగాణ."

- కేసీఆర్‌, సీఎం

రైతుల వద్దే పైసలున్నయ్‌..

రాష్ట్రంలో ప్రస్తుతం ఎవరి వద్ద పైసల్లేవు. రైతుల వద్దే ఉన్నాయి. ఇప్పటికే వారికి ధాన్యం డబ్బులు అందాయి. రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం సైతం విడుదల చేశాం. రూ.25 వేల రుణం ఉన్న ఆరు లక్షల మందికి రుణమాఫీ చేశాం. ప్రస్తుతం రైతుకు సెల్యూట్‌ కొట్టాలి. రైతు వద్ద డబ్బు ఉంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవుతుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ రైతులను కాపాడటానికి రూ.7,000 కోట్లు విడుదల చేస్తే తమకు పూర్తిస్థాయిలో జీతం ఇవ్వడం లేదని ఓ ఉద్యోగ సంఘ నేత ప్రశ్నించారు. రైతులకివ్వడానికే నీకు ఆపుతున్నానని సమాధానం ఇచ్చా. రైతులను కోటీశ్వరులు చేస్తానని చెప్పడం లేదు. వారి అప్పు తీరి... మూడు నాలుగు లక్షలు బ్యాంకులో ఉండాలనేది నా తపన.

- కేసీఆర్‌, సీఎం

నా వ్యవసాయ క్షేత్రంలో పుచ్చకాయ పండించా

"నేను నా వ్యవసాయ క్షేత్రంలో పుచ్చకాయ పండించా. దీన్ని కిలో ఎంతకు కొంటావు అని అడిగితే రూ.5 అని ఓ వ్యాపారి చెప్పారు. హైదరాబాద్‌లో ఎంతకు అమ్ముతున్నారని కనుక్కుంటే రూ.40 అని తేలింది. మరి రూ.35 ఎటు పోతున్నాయి. కనీసం రైతుకు రూ.15 దక్కడం లేదు. ఇలాంటి సమస్యలను అధిగమించడానికి రాష్ట్ర వ్యాప్తంగా 2,601 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మిస్తున్నాం. వాటికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశాం. ఈ వేదికల ద్వారా రైతులు సంఘటిత శక్తిగా మారతారు. ధరలో నిర్ణాయక శక్తిగా ఎదుగుతారు. ఈ వేదికల వద్ద రైతులతో దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడే అవకాశం ఏర్పడుతుంది."

- కేసీఆర్‌, సీఎం

ఇవీ చూడండి: నెహ్రూ జూపార్క్​లో తెల్లపులి మృతి.. సీసీఎంబీకి రిపోర్టు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.