తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (Chakali Ilamma)... సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచారని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) అన్నారు. ఆదివారం ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్... ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. అత్యంత వెనకబడిన కులంలో జన్మించిన ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని సీఎం కేసీఆర్ కొనియాడారు.
సాయుధ పోరాట కాలంలోనే హక్కుల సాధన కోసం, చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది చిట్యాల ఐలమ్మ అని ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తి ఇమిడి ఉందన్నారు. ఐలమ్మ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్న సీఎం... భావితరాలు గుర్తుంచుకునేలా మరికొన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: Mla Raghunandhan rao: కేసీఆర్.. చిత్తశుద్ధి ఉంటే ఎల్బీ స్టేడియానికి రా...