ETV Bharat / state

ముహూర్తం కుదిరింది: కొత్త సచివాలయ నమూనా ఎంపిక నేడే..

కొత్త సచివాలయం నిర్మాణానికి అడ్డంకులు తొలగడంతో నమునాలను సీఎం కేసీఆర్ ఎంపిక చేయనున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌తోపాటు మరికొందరు ఆర్కిటెక్టులు ప్రాంగణ నమూనాలను ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు. అందులో ఒక నమూనాను ముఖ్యమంత్రి ఖరారు చేయాల్సి ఉంది.

CM KCR
CM KCR
author img

By

Published : Jun 30, 2020, 6:54 AM IST

రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు సరికొత్త ప్రాంగణం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం తెలంగాణ సచివాలయ ప్రాంగణంలోని భవనాలను కూల్చి, నూతన సచివాలయాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సముచితమేనంటూ హైకోర్టు సోమవారం ప్రకటించడంతో కొత్త సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది. ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌తోపాటు మరికొందరు ఆర్కిటెక్టులు ప్రాంగణ నమూనాలను ప్రభుత్వానికి ఇప్పటికే అందజేశారు. అందులో ఒక నమూనాను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖరారు చేయాల్సి ఉంది. నూతన సచివాలయ ప్రాంగణ నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత జూన్‌లో శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

సచివాలయం మొత్తం ఖాళీ చేయాలి

తీర్పు అనుకూలంగా రావడంతో రాష్ట్ర సచివాలయ భవనాల కూల్చివేతకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. యుద్ధప్రాతిపదికన మొత్తం ఖాళీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారులను ఆదేశించింది. సచివాలయంలోని కార్యాలయాలను బీఆర్‌కే భవన్‌కు ఇప్పటికే తరలించారు. కొన్ని బ్లాక్‌లో ఇప్పటికి సామగ్రి, సర్వర్లు ఉన్నాయి. సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్‌ సోమవారం పాత సచివాలయ ప్రాంగణాన్ని పరిశీలించారు.

ఇదీ చదవండి: నూతన సచివాలయ నిర్మాణం తప్పుకాదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.