ETV Bharat / state

Mallanna Sagar: 18న మల్లన్నసాగర్‌ పనులను ప్రారంభించనున్న సీఎం!

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతే కీలకమైన మల్లన్న సాగర్‌ రిజర్వాయర్ పనులు పూర్తయ్యాయి. ఏడున్నర వేల కోట్ల రూపాయలతో చేపట్టిన రిజర్వాయర్‌ నిర్మాణ పనులు పూర్తవడానికి మూడేళ్లు పట్టింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రారంభించి నీటిని వదిలే అవకాశముంది.

Mallanna Sagar: 18న మల్లన్నసాగర్‌ పనులను ప్రారంభించనున్న సీఎం!
Mallanna Sagar: 18న మల్లన్నసాగర్‌ పనులను ప్రారంభించనున్న సీఎం!
author img

By

Published : Aug 13, 2021, 7:04 AM IST

Updated : Aug 13, 2021, 9:09 AM IST

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన భారీ రిజర్వాయర్‌ మల్లన్నసాగర్‌ నీటి నిల్వకు సిద్ధమైంది. మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో దీనిని చేపట్టారు. ఈ ఏడాది పది టీఎంసీలు నిల్వ చేయనున్నారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకపోతే ఈ నెల 18న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ రిజర్వాయర్‌లోకి నీటిని వదలనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మేడిగడ్డ, ఎల్లంపల్లి, మధ్యమానేరు, అనంతగిరి, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్ల ద్వారా కొమరెల్లి మల్లన్నసాగర్‌కు నీటిని ఎత్తిపోస్తారు. ప్రధాన నదులపై కాకుండా నీటిని మళ్లించి నిల్వ చేసుకొనే రిజర్వాయర్లలో రాష్ట్రంలో ఇదే పెద్దది. ఇది అత్యధిక ఆయకట్టుకు నీరందించనుంది. అంతేకాకుండా కొండపోచమ్మ, బస్వాపూర్‌ రిజర్వాయర్ల కింద, సింగూరు కాలువలకు, తపాసుపల్లి రిజర్వాయర్‌ కింద, దుబ్బాక నియోజకవర్గానికి నీటిని ఇచ్చేది మల్లన్నసాగర్‌ నుంచే. ఈ భారీ రిజర్వాయర్‌ నిర్మాణం మూడేళ్లలోనే పూర్తి కావొచ్చింది. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించడం, ఇంజినీర్లు గుత్తేదారులతో పనులు పరుగులు పెట్టించడానికి గట్టి ప్రయత్నం చేయడం ఇందుకు దోహదం చేశాయి.

ఏయే పనులు ఎక్కడిదాకా వచ్చాయంటే...

నిర్మాణంలో 13.61 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని చేయాలి. ఇప్పటివరకు 13.57 కోట్ల పని పూర్తయింది. మట్టికట్టకు రాతికట్టడం (రివిట్‌మెంట్‌) 26 లక్షల క్యూబిక్‌ మీటర్లు చేయాలి. 20 లక్షలు పూర్తయింది. ఈ రిజర్వాయర్‌కు నాలుగు వైపులా తూములున్నాయి. కొండపోచమ్మ, బస్వాపూర్‌ రిజర్వాయర్లకు నీటిని మళ్లించి ఆయకట్టుకు సరఫరా చేసేందుకు, రోజుకు ఒక టీఎంసీ నీటి విడుదలకు నాలుగు గేట్లతో ఒక స్లూయిస్‌ నిర్మించారు. దీనికింద ఎత్తిపోతల పనులన్నీ గతంలోనే పూర్తయ్యాయి. సింగూరు కాలువకు రోజుకు 0.6 టీఎంసీ సామర్థ్యంతో నీటిని వదలడానికి ఒక స్లూయిస్‌ ఏర్పాటు చేశారు. దుబ్బాక నియోజకవర్గంలో లక్షా 25వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ఒకటి, తపాసుపల్లి రిజర్వాయర్‌కు నీటిని మళ్లించేందుకు మరొకటి నిర్మించారు.

.

దశలవారీగా నీటి నిల్వ

మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌లో దశలవారీగా నీటిని నిల్వ చేయనున్నారు. మొదటగా ఈ ఏడాది పది టీఎంసీలు నిల్వ చేస్తారు. వచ్చే ఏడాది ఇంకా పెంచుతారు. ఈ ప్రక్రియ ఇలా దశలవారీగా ఉంటుంది. ప్రస్తుతం రివిట్‌మెంట్‌(రాతికట్టడం) 542 మీటర్ల వరకు పూర్తయింది. పది టీఎంసీలను నింపితే 532 మీటర్ల వరకు నీటి నిల్వ ఉంటుంది. ఈ మేరకు నిల్వ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూర్తి స్థాయి నీటిమట్టం 557 మీటర్లు.

అత్యధిక నిర్వాసితులు ఇక్కడే

కాళేశ్వరంలో అత్యధిక గ్రామాలు ముంపునకు గురైంది, నిర్వాసితులైంది ఈ రిజర్వాయర్‌ కిందనే. నిర్మాణంకోసం 17వేల ఎకరాల భూమి అవసరం కాగా, ఇందులో మూడువేల ఎకరాలు అటవీ భూమి. మిగిలింది పట్టా భూమి. మొత్తం 4,294 కుటుంబాల వారు నిర్వాసితులయ్యారు. ఇందులో 2,256 మంది రెండు పడక గదుల ఇళ్లను ఎంచుకొన్నారు. మిగిలిన కుటుంబాలతో పాటు 18 సంవత్సరాలు నిండి పెళ్లి కాని వారిని కూడా పరిగణనలోకి తీసుకోవడంతో మొత్తం 3,432 కుటుంబాలు అయ్యాయి. ఈ కుటుంబాల వారికి ప్లాటుతోపాటు ఇంటి నిర్మాణం కోసం రూ.ఐదు లక్షల చొప్పున చెల్లించారు. అయితే వేములఘాట్‌, ఏటిగడ్డ కిష్ణాపూర్‌కు చెందిన కొన్ని కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో దాదాపు వంద మందికి పరిహారం చెల్లింపు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇదో రికార్డు: ప్రాజెక్టు ఎస్‌ఈ వేణు

ప్రాజెక్టు ఎస్‌ఈ వేణు

ఈ ఏడాది నీటి నిల్వకు అవసరమైన అన్ని పనులూ పూర్తయ్యాయి. గేట్లు, ఇతర పనుల్లో మిగిలినవి ఈ నెలాఖరుకు పూర్తవుతాయి. రివిట్‌మెంట్‌ (మట్టికట్టపై రాళ్లను అమర్చడం) కొంత మిగిలి ఉంది. రెండు మూడునెలల్లో ఈ పని పూర్తవుతుంది. దీంతో మల్లన్నసాగర్‌ అన్ని రకాలా పూర్తయినట్లే. తక్కువ సమయంలోనే ఇంత భారీ రిజర్వాయర్‌ నిర్మాణం పూర్తి చేయడం రికార్డు. దీని దిగువన ఉన్న కొండపోచమ్మను కూడా తక్కువ సమయంలోనే పూర్తి చేశాం.

ప్రాజెక్టు స్వరూపం

వ్యయం: రూ.7,500 కోట్లు.

సేకరించిన భూమి: 17వేల ఎకరాలు

నిల్వ సామర్థ్యం: 50 టీఎంసీలు

ఒప్పందం: 2017 నవంబరులో

పనులు ప్రారంభం: 2018లో కొంత, 2019 మధ్యలో పూర్తి స్థాయిలో

ఇదీ చూడండి: తడి నయనాలతో... ఊరు ఖాళీ అయింది

Last Updated : Aug 13, 2021, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.