పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై తెలంగాణ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారని సీఎల్పీనేత భట్టి విక్రమార్క (clp leader batti vikramarka) ఆరోపించారు. ఉపాధి హామీ నిధులు శ్మశాన వాటికలకు, పల్లెప్రగతికి వాడుతున్నారని విమర్శించారు. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా నిధులు ఇవ్వాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. పంచాయతీ డబ్బులతోనే ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్లు సర్పంచులు చెబుతున్నారని వెల్లడించారు. ట్రాక్టర్ కిస్తీలు కూడా పంచాయతీ నిధులతోనే కడుతున్నారని అన్నారు. విద్య, ఆరోగ్యం, పంటలకు మద్దతు ధర తదితర అంశాలు పల్లెప్రగతిలో పొందుపరచాలని సూచించారు. కేవలం మొక్కలు నాటితే సరిపోదని భట్టి చురకలంటించారు.
ఉపాధి హామీ నిధులను దారి మళ్లిస్తున్నారు. ఉపాధి హామీ నిధులు శ్మశాన వాటికలకు, పల్లెప్రగతికి వాడుతున్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా నిధులు ఇవ్వాలని కోరుతున్నాం. పంచాయతీ డబ్బులతోనే ట్రాక్టర్లు కొనుగోలు చేసినట్లు సర్పంచులు చెబుతున్నారు. ట్రాక్టర్ కిస్తీలు కూడా పంచాయతీ నిధులతోనే కడుతున్నారు.
- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత
భట్టి ఆరోపణలకు కేసీఆర్ సమాధానం
గ్రామపంచాయతీలకు కేంద్రం ప్రత్యేకంగా ఇచ్చే నిధులేమీ ఉండవని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శాసనసభలో భట్టి ఆరోపణలకు మరోసారి స్పష్టత ఇచ్చారు. ఉపాధి హామీ తదితర నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపణలను ఖండించారు. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే నిధులు కేటాయిస్తారని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే మన రాష్ట్రానికి కేటాయింపులు ఉన్నాయని తెలిపారు. కేంద్రం ప్రత్యేకంగా ఇస్తున్నదేమిలేదని చెప్పారు.
పంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులు ప్రత్యేకంగా ఉండవు. ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే నిధులు కేటాయిస్తారు. అన్ని రాష్ట్రాల తరహాలోనే మనకూ కేటాయింపులు. కేంద్రం ప్రత్యేకంగా ఇస్తుదేమి లేదు. మీ మాటలు సవరించుకోండి.
- కేసీఆర్, ముఖ్యమంత్రి
ఇదీచూడండి: kcr clarify on 3 acres to dalits: దళితులకు మూడెకరాలు ఇస్తామని చెప్పనేలేదు: సీఎం