CM KCR Suffering From Viral Fever : గత పది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న సీఎం కేసీఆర్(CM KCR Viral Fever) ఆరోగ్యంపై మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు. వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న సీఎంకు.. ఛాతిలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వచ్చిందని తెలిపారు. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వల్ల కోలుకోవడానికి కాస్త ఆలస్యమవుతుందన్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని.. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని మంత్రి కేటీఆర్ వివరించారు.
వారం రోజుల క్రితం సీఎం కేసీఆర్ వైరల్ జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. కేసీఆర్‌కు ఇంట్లోనే వైద్య బృందం చికిత్స చేస్తోందని తెలిపారు. ఆయనను నిశితంగా పరిశీలిస్తోందన్నారు. కొద్ది రోజుల్లోనే అతను సాధారణ స్థితిలోకి చేరుకుంటారని వైద్యులు చెబుతున్నారని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ అంటూ.. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
KCR Comments on BRS Party : 'బీఆర్ఎస్.. దేశాన్ని మార్చేందుకు ఏర్పాటు చేసిన మిషన్'
CM KCR Suffering From Viral Fever and Cough : వైరల్ ఫీవర్ కావడంతో గత మూడు వారాలుగా సీఎం కేసీఆర్ ప్రభుత్వ కార్యక్రమాలకు, ప్రజలకు దూరంగా ఉంటున్నారు. ఆయనను ప్రగతి భవన్‌లోనే వైద్యుల బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. సెప్టెంబరు 26న మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ట్వీట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో కనిపించిన సీఎం.. ఆ తర్వాత ప్రగతిభవన్‌లో జరిగిన వినాయక పూజలో కనిపించారు. వినాయక చతుర్ధి తర్వాత నుంచి అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి కార్యక్రమానికి, బహిరంగ సభకు వెళ్లలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు వైరల్ ఫీవర్‌తోనే బాధపడుతున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.
Telangana Cabinet Meeting : సీఎం కేసీఆర్ అధ్యక్షతన నేడే మంత్రివర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ
KCR Sangareddy Tour : ఆసియాలోనే అతిపెద్ద గృహ సముదాయాన్ని ప్రారంభించిన కేసీఆర్