ETV Bharat / state

CM KCR Speech at Golconda Fort : 'తెలంగాణ ప్రగతి చూసి యావత్‌ దేశం ఆశ్చర్యపడుతోంది' - 77వ స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం

CM KCR Speech at Golconda Fort : గతంలో రాష్ట్రంలో ఎటు చూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలు ఉండేవని.. విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. అనతి కాలంలోనే రాష్ట్రం తిరుగులేని విజయాలు సాధించిందని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడారు.

Etv Bharat
CM KCR
author img

By

Published : Aug 15, 2023, 12:40 PM IST

Updated : Aug 15, 2023, 2:55 PM IST

CM KCR Speech at Golconda Fort : 77వ స్వాతంత్య్ర వేడుకలు గోల్కొండ కోటలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన కేసీఆర్‌.. సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనను తిలకించారు. అనంతరం.. రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా మొదట రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళి అర్పించారు.

CM KCR Speech at 77th Independence Day Celebrations : దేశ భక్తి పెంచేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. 75 ఏళ్ల ప్రగతి ఘనమే అయినా ఇంకా చేయాల్సింది ఉందన్న సీఎం.. పాలకుల అసమర్థత, భావదారిద్య్రం వల్ల సమస్యలు ఇంకా ఉన్నాయన్నారు. పేదరికం, అసమానతలు ఇంకా తొలగిపోలేదన్నారు. అన్ని వర్గాలు అభివృద్ధి సాధించిన రోజే నిజమైన స్వాతంత్యం వచ్చినట్టని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఘోరమైన వివక్ష ఎదుర్కొందన్న కేసీఆర్.. సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం తలచుకుంటే ఇప్పటికీ దుఃఖం పొంగుకొస్తుందన్నారు.

'గతంలో ఎటుచూసినా ఆకలి కేకలు.. ఆత్మహత్యలు.. పడావు పడ్డ భూములు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక యజ్ఞంగా నిర్వహించాం. విధ్వంసమైన తెలంగాణను విజయపథం వైపు నడిపించాం. అనతి కాలంలోనే తెలంగాణ తిరుగులేని విజయాలు సాధించింది. అనేక రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాం. తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుసరిస్తోందనే పేరు తెచ్చాం. నేడు తెలంగాణలో నిరంతర విద్యుత్‌ వెలుగులు కనిపిస్తున్నాయి. పంట కాలువలతో.. పచ్చని చేలతో కళకళలాడుతోంది. కాళేశ్వరం(Kaleshwaram)జీవధారలతో సస్యశ్యామలం అవుతోంది.'-ముఖ్యమంత్రి కేసీఆర్

Rythu Runamafi Telangana 2023 : అన్నదాతలకు పంద్రాగస్టు కానుక.. రూ.99,999 లోపు రైతు రుణాలన్నీ మాఫీ

రాష్ట్ర ప్రగతిని చూసి యావత్​దేశం ఆశ్చర్యపడుతోంది..: తెలంగాణ ప్రగతి చూసి యావత్‌ దేశం ఆశ్చర్యపడుతోందని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధిలో సువర్ణ అధ్యాయం లిఖిస్తోందన్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఇలాగే అందించాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru Rangareddy Project)కు పెద్ద అవరోధం తొలగిపోయిందని పేర్కొన్నారు. సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు పచ్చని పైరులతో కళకళలాడుతాయన్నారు. తాగునీటి కోసం త్వరలోనే జలాశయాలకు నీటి ఎత్తిపోతలు ప్రారంభిస్తామని తెలిపారు.

CM KCR Speech at Golconda Fort 'తెలంగాణ ప్రగతి చూసి యావత్‌ దేశం ఆశ్చర్యపడుతోంది'

'రెండు దశల్లో రూ.37వేల కోట్ల రుణమాఫీ చేశాం. తలసరి ఆదాయం, విద్యుత్తు వినియోగంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌. విద్యుత్తు రంగంలో రాష్ట్రానిది స్ఫూర్తిదాయక విజయగాథ. గత నెలలో అసాధారణ స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపట్టింది. తక్షణ సహాయ చర్యలకు రూ.500 కోట్లు విడుదల చేశాం. ఈసారి వరి సాగు రికార్డు స్థాయిలో ఉంటుందని అంచనా. రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శం. రెండు దశల్లో రైతులకు దాదాపు రూ.37 వేల కోట్లు రుణమాఫీ చేశాం. రైతులను ఈ తరహాలో రుణ విముక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదు.'-సీఎం కేసీఆర్

Tiranga Decoration in Edupayala Temple : 'త్రివర్ణ' రూపంలో ఏడుపాయల దుర్గమ్మ దర్శనం.. భక్తుల పరవశం

'వచ్చే ఏడాది ఎర్రకోటపై మరోసారి ప్రసంగిస్తా'.. 2024 ఎన్నికల గెలుపుపై ప్రధాని మోదీ ధీమా

Last Updated : Aug 15, 2023, 2:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.